Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ ఫ్యామిలీకి మరో షాక్.. ఒకేసారి 5 మంది మృతి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. బీహార్‌లో మంగళవారం ఉదయం జరిగిన పెద్ద రోడ్డు ప్రమాదంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువులు ఐదుగురు మరణించడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. అలాగే మరొక నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్ కుటుంబ సభ్యులు ఎస్‌యూవీలో ప్రయాణిస్తుండగా, లఖిసరాయ్ జిల్లాలో జాతీయ రహదారి నంబర్ 333పై వాహనం ట్రక్కును ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మరో నలుగురు గాయపడ్డారు,

ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అంటున్నారు. ట్రక్ డ్రైవర్ మరియు అతని సహాయకుడు పారిపోగా, SUV కారు తీవ్రంగా దెబ్బతింది. నివేదికల ప్రకారం, వాహనం నుండి మృతదేహాలను బయటకు తీయడానికి అధికారులు ఐరన్ కట్టర్లను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. గతేడాది ముంబైలో మరణించిన సుశాంత్‌కు తండ్రి, నలుగురు సోదరీమణులు ఉన్నారు. బాధితులు పాట్నా నుండి జాముయికి తిరిగి వస్తున్నారు, అక్కడ వారు బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లారు.

మృతులను లాల్‌జిత్ సింగ్, అతని ఇద్దరు కుమారులు అమిత్ శేఖర్ అలియాస్ నేమాని సింగ్, రామ్ చంద్ర సింగ్, కూతురు బేబీ దేవి, మేనకోడలు అనితాదేవి, డ్రైవర్ ప్రీతం కుమార్‌లుగా గుర్తించారు. లాల్‌జిత్ సింగ్ హర్యానా సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ సింగ్‌కి బావ. ఓపీ సింగ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి బావ.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus