పారితోషికం విషయంలో గొప్పలకు పోయి ఇబ్బందులు పడుతున్న హీరో

అతనొక యంగ్ హీరో. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో, వెబ్ సిరీస్..లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అలా సంపాదించుకున్న క్రేజ్ తో, పరిచయాలతో హీరోగా మారాడు. అతని మొదటి సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత చేసిన 2 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి డీసెంట్ సక్సెస్ అందుకున్నాయి.

అయితే అటు తర్వాత వచ్చిన సినిమాలు కంటెంట్ పరంగా ఓకే అనిపించినా బాక్సాఫీస్ రిజల్ట్ విషయంలో తేడా కొట్టేశాయి.సరే జయాపజయాలు ఏ హీరోకైనా కామన్. కానీ ఈ హీరో చేసిన తప్పేంటంటే..నెక్స్ట్ సినిమాలకి రూ.3 కోట్లు పారితోషికం అంటూ సినీ సర్కిల్స్ మొత్తానికి చెప్పేయడం. దాని వల్ల ఇప్పుడు హీరోకి ఆఫర్లు తగ్గుముఖం పట్టాయని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి ఓ పెద్ద బ్యానర్లో ఇతను చేసిన సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

కానీ తర్వాత ఇతను చేయాల్సిన ప్రాజెక్టులు చేతులు మారుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ క్రమంలో ఇతని టీం ఈ విషయంపై ఆరా తీయగా.. ‘ఆ హీరో లేటెస్ట్ సినిమాకు రూ.7 కోట్లు బడ్జెట్ పెడితేనే రికవరీ కాలేదు. ఇప్పుడు అతనికి రూ.3 కోట్లు పారితోషికం ఇస్తే సినిమా ఇంతలో కంప్లీట్ చేస్తాం’ అంటూ మొహం చాటేసాడట ఓ నిర్మాత. అలాగే నెక్స్ట్ సినిమాకి పెంచితే రూ.75 లక్షలకి మించి ఇవ్వలేనని తెగేసి చెప్పాడట. దీంతో రూ.3 కోట్ల కల ఆ హీరోకి తీరేలా లేదని అంతా అనుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus