SSMB28: మహేష్- త్రివిక్రమ్ సినిమా.. అదంతా ఫేక్ అట..!

  • October 31, 2022 / 08:37 PM IST

త్రివిక్రమ్ నెక్స్ట్ లెవెల్లో సినిమాలు చేసింది లేదు.పాత సినిమాల కథలకు తనకు అలవాటైన ఫ్యామిలీ డ్రామాని జోడించి ఓ సినిమా తీస్తాడు. అతను యాక్షన్ జోనర్ కు వెళ్లి చేసిన ‘ఖలేజా’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాల ఫలితాలు అందరికీ తెలుసు. కొంతలో కొంత ‘అరవింద సమేత’ పర్వాలేదు కానీ ఆ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అయిన సినిమా కాదు. అయినప్పటికీ ‘అల వైకుంఠపురములో’ చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎగబడుతున్నారు.

అయితే త్రివిక్రమ్ మాత్రం ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారితో ఏ స్టార్ హీరో సినిమా చేయాల్సి ఉందో ఆ స్టార్ హీరోతో చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా ‘శ్రీమంతుడు’ టైంలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు మహేష్ కు ఇచ్చిన అడ్వాన్స్ కారణంగా ప్రస్తుతం ఓ ప్రాజెక్టుని మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన దగ్గర్నుండి చాలా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్న టైంలో మహేష్ బాబుకు ఆ యాక్షన్ సీక్వెన్స్ నచ్చక ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయినట్టు ఫేక్ ప్రచారం జరిగింది.

కానీ మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక ఆయన విదేశాలకు వెళ్లారు అని నిర్మాతలు ప్రకటించారు. ఇక ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక ఔట్పుట్ బాలేదు అని భావించి మహేష్ బాబు ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకున్నట్టు మళ్ళీ కథనాలు మొదలయ్యాయి. అంతేకాదు బయ్యర్స్ కు నిర్మాతలు తీసుకున్న అమౌంట్ ను వెనక్కి ఇచ్చేయడం కూడా జరుగుతుందట. మరోపక్క ‘త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా మా హీరోతో అంటే మా హీరోతో’ అంటూ ఫేక్ న్యూస్ లు ట్రెండ్ చేస్తున్నారు.

దీంతో ఈ ఫేక్ వార్తలు సృష్టిస్తుంది బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్సే అంటూ అంతా చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ ఆ హీరోలతో సినిమాలు చెయ్యాలి అనుకున్నా ఆ హీరోలు ఖాళీగా లేరు కదా. అయినా అభిమానుల ఆరాటం ఎందుకో..! అయితే మహేష్ – త్రివిక్రమ్ ల సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుంది అంటూ నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించి ఈ ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus