Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఏమైందంటే?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 2023 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలుకాలేదు. మరోవైపు ప్రభాస్ గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోకపోవడంతో ఈ సినిమాపైనే ప్రభాస్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే దసరా పండుగ కానుకగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ రానుందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

అయితే ఆదిపురుష్ మేకర్స్ అభిమనులకు మరోసారి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. దసరా పండుగకు ఆదిపురుష్ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఆదిపురుష్ మేకర్స్ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆదిపురుష్ మేకర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఈ సినిమాకు ఇప్పటికే వచ్చిన క్రేజ్ కచ్చితంగా పోతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ పెదనాన్న చనిపోవడం వల్ల కూడా ఆదిపురుష్ టీజర్ ఆలస్యమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఆదిపురుష్ పై క్రేజ్ తక్కువగానే ఉంది. ఈ సినిమాకు ఏకంగా 500 కోట్ల రూపాయల ఖర్చైందని తెలుస్తోంది. అయితే బడ్జెట్ కు తగిన స్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్స్ మాత్రం జరగడం లేదని చెప్పవచ్చు.

ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ కోరుకున్న భారీ సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. ఓం రౌత్ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కించిన ఆదిపురుష్ అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus