Mahesh Babu, Rajamouli: మహేష్ మూవీ కోసం బాహుబలి స్ట్రాటజీ.. కానీ?

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి1, బాహుబలి2 ఏ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మహేష్ మూవీ విషయంలో కూడా జక్కన్న ఇదే స్ట్రాటజీని ఫాలో కానున్నారని తెలుస్తోంది. మహేష్ మూవీని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నారని బోగట్టా. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఆలస్యం కావడం వెనుక కూడా అసలు కారణం ఇదేనని తెలుస్తోంది.

షాకింగ్ ట్విస్ట్ తో ఫస్ట్ పార్ట్ ను ముగించి రెండో పార్ట్ దిశగా అడుగులు వేయాలని జక్కన్న భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం కూడా లీక్ కాకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. వరుస విజయాల నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

రాజమౌళి ఈ సినిమాకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. మహేష్ కూడా ఈ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ రాజమౌళి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకనుందని తెలుస్తోంది.

రాజమౌళి సినిమాపై మహేష్ బాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. మహేష్ ఈ సినిమా కోసం ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయించారని బోగట్టా. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూట్ మొదలుకాకుండానే రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus