NTR Watch Cost: తారక్‌ ఇంట్లో కాస్ట్‌లీ వస్తువులు ఎన్ని ఉన్నాయో తెలుసా?

  • December 11, 2021 / 03:57 PM IST

సోషల్‌ మీడియాలో తారక్‌ అభిమానులు, నెటిజన్ల చర్చ చూశారా? అదేదో కొత్త సినిమా గురించో, కొత్త పోస్టర్‌ గురించో కాదు! తారక్‌ చేతికున్న గడియారం గురించి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారం కోసం తారక్‌… టీమ్‌తో కలసి దేశం మొత్తం తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తారక్‌ చేతికున్న గడియారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దానికి కారణం ఆ గడియారం ధర. అవును ఆ వాచీ ధర అంతుంది మరి.

నలుపు రంగు డయల్‌, రెడ కలర్‌ పిన్‌తో భలే ఉంది ఆ వాచ్‌. దీంతో ఆ వాచ్‌ గురించి అందరూ గూగుల్‌ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ వాచ్‌ ధర చూసి అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆ వాచీ ధర ఆన్‌లైన్‌ మార్కెట్‌లో సుమారు నాలుగు కోట్ల రూపాయలు. రిచర్డ్‌ మిల్లే ఆర్‌ఎం 011 వాచ్‌ అది. అందులో ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ అంట. అందుకే అంత ధర అని అంటున్నారు. నిజానికి ఈ తరహా వాచ్‌ ఒకటి తారక్‌ దగ్గర ఇంతకు ముందే ఉండేది. ఇది వేరకొటి అని తెలుస్తోంది.

తారక్‌ దగ్గర భారీ ధరల వస్తువులు ఇప్పటికే చాలా ఉన్నాయి. లంబోర్గిని ఉరుస్‌ మోడల్‌ కారు తారక్‌ సొంతం. దీని ధర ఐదు కోట్ల రూపాయల పైమాటే. సోదరుడు కల్యాణ్రామ్‌ గతంలో తారక్‌కు కోటి రూపాయల విలువున్న వాచ్‌ ఒకటి ఇచ్చాడు. ఇక కారవాన్‌ సంగతి సరే సరి. తన కోసం ప్రత్యేక వోల్వో కారవాన్‌ కూడా సిద్ధం చేయించుకున్నాడు తారక్‌. ఇక తారక్‌ కార్ల నెంబర్ల గురించి సరేసరి. ఆ మధ్య 9999 నెంబరు కోసం సుమారు 11 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇక ముందు చెప్పినట్లు రిచర్డ్‌ మిల్లే వాచ్‌ మరొకటి కూడా అతని దగ్గర ఉంది. దాని ధర సుమారు రెండున్నర కోట్లు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus