Pushpa 2: ఆ వార్తల గురించి బన్నీ, సుకుమార్ స్పందిస్తారా?

రాజమౌళి సూచన మేరకు సుకుమార్ పుష్ప ది రైజ్ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో ప్రమోషన్స్ లేకుండానే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తగ్గేదేలే అనే డైలాగ్ బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో పాపులర్ కాగా గూగుల్ సెర్చ్ లో బన్నీ సాధించిన అరుదైన రికార్డుకు కూడా పుష్ప ది రైజ్ సక్సెస్ కారణమని చాలామంది అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

పుష్ప ది రైజ్ విజయంతో ఆకాశమే హద్దుగా పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ది రైజ్ సక్సెస్ సాధించినా ఈ సినిమా కోసం భారీ మొత్తంలో నిర్మాతలు ఖర్చు చేయగా ఎక్కువ మొత్తంలో ఈ సినిమా ద్వారా లాభాలు దక్కలేదు. హిందీ రైట్స్ విషయంలో ఏర్పడిన సమస్య వల్ల నిర్మాతలకు ఎక్కువగా లాభాలు రాలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు విచిత్రమైన సమస్య వచ్చింది.

సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో పుష్ప2 సినిమా కథ ఇదేనంటూ ఎన్నో కొత్త కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమాలో రష్మిక పాత్ర చనిపోతుందని, రష్మిన పాత్ర పుష్పరాజ్ ను పోలీసులకు పట్టిస్తుందని, భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర చెల్లిగా మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని, కోలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఈ సినిమాలో విలన్ గా నటిస్తారని ఎన్నో వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

వైరల్ అవుతున్న వార్తల్లో కొన్ని వార్తలు నమ్మేలా ఉంటే మరికొన్ని వార్తలు అస్సలు నమ్మే విధంగా లేవు. నిర్మాతలు ఇప్పటికే పుష్ప2 సినిమా గురించి ప్రచారంలోకి వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని చెబుతున్నా ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. బన్నీ లేదా సుకుమార్ ఈ వైరల్ వార్తల గురించి స్పందించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ వార్తలు ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus