బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం నామినేషన్స్ లో భాగంగా బిందుమాధవి అఖిల్ ని నామినేట్ చేసింది. అంతేకాదు, అన్నం తినేటపుడు స్మగ్లర్స్ వండిన వంట ఎందుకు తింటున్నావ్ అంటే ఎవరికైనా సరే బాధ కలుగుతుందని, ప్లేట్ విసిరేయడంలో నా తప్పు ఎంత ఉందో అంతే తప్పు నీది కూడా ఉందని మాట్లాడింది. అక్కడే స్ట్రాంగ్ గా అఖిల్ బిందుకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఇక హౌస్ లో ఎక్కువగా అలిగేది మీరే అని అది కూడా కరెక్ట్ గా అనిపించడం లేదని, నామినేషన్స్ లో అఖిల్ అలకని హైలెట్ చేసింది బిందు.
ఇదే విషయాన్ని నామినేషన్స్ అయిన తర్వాత అఖిల్ తేజస్వితో డిస్కస్ చేశాడు. ఇక మార్నింగ్ అందరూ ఫన్ మూడ్ లోకి వచ్చేశారు. అయితే, అషూరెడ్డితో ఓవర్ గా థింక్ చేస్తున్నావని చెప్పొద్దని, ఇది కూడా హైలెట్ అయిపోతుందని అఖిల్ చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. అఖిల్ అలుగుతున్నానని హౌస్ మొత్తం ఎలా తెలుస్తుందని, అది హైలెట్ అవ్వడం నాకు ఇష్టం లేదంటూ అషూతో మాట్లాడాడు. వీళ్లిద్దరూ మాట్లాడేటపుడే అషూరెడ్డి కొద్దిగా ఎమోషనల్ అయిపోయింది.
అఖిల్ మాట్లాడుతుంటేనే లేచి వెళ్లి లివింగ్ రూమ్ లో బాధపడింది. ఏడ్చేసింది. అక్కడే ఉన్న అరియానా వచ్చి అషూరెడ్డిని ఓదార్చింది. అషూ చాలా సేపు ట్రిగ్గర్ అయి బాధపడింది. ఒక్క రెండు నిమిషాల తర్వాత అఖిల్ వచ్చి ఏమైంది అని అడిగేసరికి, అషూరెడ్డి నేను ఇంక ఓవర్ థింకింగ్ అనే మాట అనను అని చెప్పింది. ఇక్కడే అఖిల్ తనకి ఎలాంటి విషయాల్లో కోపం వస్తుందో, ఇలా పదాలు వాడితే అవన్నీ హైలెట్ అవుతాయని ముందు జాగ్రత్తగా చెప్పాడు. అషూరెడ్డిని ఈ విషయానికి ఎందుకు బాధపడ్డావ్ అంటూ అడిగాడు.
నిజానికి అఖిల్ సీజన్ 4లో తనకి మైనస్ అయినవాటిని ఇక్కడ ప్లస్ పాయింట్స్ గా మార్చుకోవాలని చూస్తున్నాడు. వేరే ఎవరైనా స్టేట్మెంట్స్ ఇస్తుంటే వెళ్లి వాళ్లని వద్దని చెప్తున్నాడు. ఈ విషయంలో అఖిల్ చాలా క్లారిటీగా ఉన్నాడు. ముందుగానే తనకి ఫ్రెండ్స్ అయిన వాళ్లని హెచ్చరించేస్తున్నాడు. నామినేషన్స్ లో బిందు అలక గురించి హైలెట్ చేయగానే జాగ్రత్తపడుతున్నాడు. అంతేకాదు, తనపైన ఎక్కువగా జోకులు వేస్తూ ఓవర్ గా మాట్లాడుతుంటే వాళ్లని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. అజయ్, స్రవంతి, ఇప్పుడు అషూకి కూడా స్ట్రాంగ్ గా చెప్పాడు. మొత్తానికి అదీ మేటర్.