Varun, Lavanya: వరుణ్-లావణ్య ల పెళ్ళికి నిహారిక అడ్డు..!

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జూన్ 9న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మణికొండలో ఉన్న నాగబాబు ఇంట్లోనే వీరి ఎంగేజ్మెంట్.. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొద్దిరోజుల తర్వాత రాంచరణ్ – ఉపాసనలకి పాప జన్మించింది. ఈ రెండు శుభవార్తలతో మెగా అభిమానుల్లో ఆనందం మొదలైంది. కానీ ఊహించని విధంగా నిహారిక విడాకుల మేటర్ తెరపైకి రావడం అందరినీ కొంత డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి.

ఈ క్రమంలో అందరిలోనూ కొన్ని ధర్మ సందేహాలు ఏర్పడ్డాయి. మరో రకంగా ఇవి చర్చనీయాంశం అయ్యాయి అని కూడా చెప్పాలి. విషయం ఏంటంటే.. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆడపడుచు పుట్టింట్లో ఉండగా ఆమె సోదరుడికి పెళ్లి చేయకూడదు అని అంటుంటారు. ఆమెకు పెళ్లి చేశాకే సోదరుడి పెళ్లి చేయాలి. సరిగ్గా ఇప్పుడు నిహారిక విడాకులు తీసుకుని పుట్టింట్లో ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉండగా..

వరుణ్ తేజ్ (Varun) – లావణ్య ల పెళ్లి చేయడం అనేది సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకం అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి నిహారికకి రెండో పెళ్లి చేశాక.. వరుణ్ – లావణ్య ల పెళ్లి జరుగుతుందా? లేక వాటిని పక్కన పెట్టేసి… వాళ్ళ పెళ్లి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. నిహారిక అయితే ప్రస్తుతానికి వెబ్ సిరీస్లలో నటిస్తూ.అలాగే కొత్త వాటిని. నిర్మిస్తూ కాలం గడుపుతుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus