Nithiin,Rashmika: నితిన్‌ – రష్మిక – వెంకీ సినిమా కథ ఇదేనా? వినడానికే..!

వెంకీ కుడుముల సినిమాల చూడటానికి సగటు కమర్షియల్‌ సినిమాల్లా ఉంటాయి, కానీ దిగితే తెలుస్తుంది వాటిలో మసాలా ఏంటి అనేది. గతంలో ఆయన చేసిన రెండు సినిమాలు ఇలా సాదాసీదాగా వచ్చి విజయం అందుకున్నవే. ఇప్పుడు మూడో సినిమాతో ఆయన రాబోతున్నారు. VNRTrio అంటూ ఇటీవల ఈ సినిమాను ఘనంగా అనౌన్స్‌ చేసి, అంతే ఘనంగా ప్రారంభించారు కూడా. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్‌ బయటకు వచ్చింది. ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో వరుస విజయాల్ని నమోదు చేసుకున్న వెంకీ కుడుముల తన ఫేవరెట్‌ హీరోయిన్‌ రష్మిక మందనతోనే ఈ సినిమా చేయబోతున్నారు.

అనౌన్స్‌మెంట్‌ బట్టి చూస్తే ఇది పక్కా కమర్షియల్‌ కాన్సెప్ట్‌ అని తెలుస్తోంది. అయితే దాని వెనుక కన్నీళ్లు, కష్టాలు కూడా ఉంటాయి అని అంటున్నారు. ప్రాణాంతకమైన వ్యాధితో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ ఈ సినిమా అని చెబుతున్నారు. అయితే చెప్పినంత సీరియస్‌గా ఈ సినిమా ఉండదు అంటున్నారు. మరో నెలలో చనిపోతాను అని తెలుసుకున్న ఆ వ్యక్తి ఎలా ఫీల్ అయ్యాడు?, తన జర్నీని హ్యాపీగా ఎలా మార్చుకున్నాడు?,

ఈ క్రమంలో సింపతీ చూసి ఎలా ఇరిటేట్ అయ్యాడు ? అనే కోణాల్లో ఈ కథ ఉంటుంది అంట. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కామెడీగానే చూపిస్తారట. అంటే సీరియస్‌ కథనే ఫన్నీ నోట్‌ చెప్పి నవ్విస్తూనే, ఆలోచింపజేస్తారని టాక్‌ నడుస్తోంది. అలాగే ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్‌ కూడా ఉంది అని సమాచారం.

సరైన విజయాల్లేక ఇబ్బంది పడుతున్న నితిన్‌ (Nithiin) ఈ సినిమాతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని చూస్తున్నాడు. హిందీ ఫ్లాప్‌ల తాకిడి నుండి తెలుగు హిట్‌ ద్వారా బయట పడాలని రష్మిక చూస్తోంది. ఇక మూడేళ్ల నుండి సినిమా కథలు వండుకుంటూ బిజీగా ఉన్న వెంకీ కుడుమల కూడా సాలిడ్‌ హిట్‌ ఇచ్చి మళ్లీ చిరు కథను ఫైనల్‌ చేసుకోవాలని అనుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus