Animal: ‘యానిమల్’ యూనిట్ కి రన్ టైం టెన్షన్..!

  • November 4, 2023 / 08:46 PM IST

ఈ మధ్య కాలంలో ఏ సినిమా అయినా సరే తక్కువ రన్ టైం ఉంటే బెటర్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఫుటేజ్ ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకు అని రెండు గంటల నలభై నిమిషాల రన్ టైం పెడితే.. ఆడియన్స్ అంతగా అట్రాక్ట్ అవ్వడం లేదు. ఈరోజుల్లో ప్రేక్షకులు థియేటర్ కి రావాలి అంటే అది 6 గంటల ప్రాసెస్. అంత టైం థియేటర్ కి కేటాయించాలి అంటే సినిమాపై ఆసక్తి ఉండాలి.

కానీ ఇలా రన్ టైం ఎక్కువైతే వాళ్ళు భారంగా ఫీలవుతారు. అలా అని 3 గంటల రన్ టైం ఉన్న సినిమాలు విజయం సాధించలేదా? అంటే …విజయం సాధించిన సినిమాలు ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాల రన్ టైం 3 గంటల వరకు ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన రెండో సినిమాగా ‘యానిమల్’ ని (Animal) రూపొందించాడు. దీని రన్ టైం ఏకంగా 3 గంటల 15 వరకు ఉంటుందట.

దీంతో నిర్మాతల గుండెల్లో గుబులు పుట్టింది. అసలుకైతే 3 గంటల 30 నిమిషాల రన్ టైం వచ్చిందట. సందీప్ .. ఒక 15 నిమిషాల వరకు ట్రిమ్ చేసి దాన్ని 3 గంటల 15 నిమిషాలకు ఫైనల్ చేశాడు. అయితే సినిమా పై అంచనాలు ఉన్నాయి కాబట్టి.. 3 గంటల పాటు తన స్క్రీన్ ప్లే తో కూర్చోబెట్టగలిగితే మిగిలిన పావుగంట భారంగా ప్రేక్షకులు ఏమీ ఫీలవ్వరు. ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ ..ల విషయంలో సందీప్ చేసింది అదే.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus