తెలుగు వారికి సెంటిమెంట్లు ఎక్కువ… తెలుగు సినిమాలకు సెంటిమెంట్లు ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఇలాంటి ఓ సెంటిమెంటే టాలీవుడ్‌ను పట్టి పీడిస్తోందా? అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. టాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చి పరాజయం పాలైన సినిమాల వెనుక కామన్ పాయింట్ ఒకటుంది. ఈ మేరకు కామెంట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. ‘ఆయన్ను కలవడమే తప్పా?’ అనే పోస్టులు మీకు కూడా కనిపించే ఉంటాయి.
తక్కువ ధరకే సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం కొన్ని నెలలపాటు ఒంటెద్దు పోకడలకు పోయింది. ప్రజల నుండి, ఇండస్ట్రీ జనాల నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా, రిక్వెస్టులు వచ్చినా వినిపించుకోలేదు. అయితే చిరంజీవి నేతృత్వరంలో వరుస మీటింగ్‌లు, గ్రూప్ మీటింగ్‌లు జరిగాక అప్పుడు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పుడు అదే టాలీవుడ్‌ను ఇబ్బందులు పెడుతోందా. ఏమో మరి ఫలితాలు చూస్తుంటే, సెంటిమెంట్లను నమ్మే వారికి అదే అనిపిస్తోంది. కావాలంటే ఓసారి మీరే చూడండి.
తెలుగు సినిమా బృందం… ఏపీ సీఎంను కలవడానికి ముందు, కొత్త టికెట్ ధరల జీవో రావడానికి ముందు టాలీవుడ్‌లో వరుస హిట్లు వచ్చాయి. ‘అఖండ’, ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్’, ‘బంగార్రాజు’ అంటూ హిట్లే హిట్లు. కానీ ఇటీవల కాలంలో అలాంటి హిట్లే కరువయ్యాయి. ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి వచ్చి తుస్ మనిపించగా, ‘ఆచార్య’ మొన్నీ మధ్య వచ్చి బాబోయ్ అనిపించింది. ఈ రోజు ‘సర్కారు వారి పాట’ వచ్చి సప్పగా మారిపోయింది. ఈ మూడు సినిమాలకు ఒక కామన్‌పాయింట్ ఉంది.
అదే… వీళ్లంతా సినిమా ఇండస్ట్రీ కోసం ఆ మధ్య వెళ్లి ఏపీ సీఎంను కలవడం. ఆయనను కలవడంలో ఎలాంటి తప్పులేదు. తప్పుకాదు కూడా. కానీ ఆయనను కలసి హీరోల సినిమాలు దారుణంగా పరాజయం పాలవుతుండటంపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ కనిపిస్తున్నాయి. సినిమా కథల ఎంపిక, రాత, తీత విషయంలో సీఎం జగన్ ప్రమేయం లేకపోవచ్చు. కానీ సెంటిమెంట్లను నమ్మే మన టాలీవుడ్ జనాలు అలా అనుకుంటున్నారు. ఇక్కడో విషయం ఏంటంటే.. ఆయనను కలిసిన హీరోల సినిమాలన్నీ వచ్చేశాయ్. సో ఇక ఫ్లాప్‌లు ఉండవు అనుకోవచ్చు అని కూడా కామెంట్స్ కనిపిస్తున్నాయి.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!