కెరీర్ బిగినింగ్ నుండి ఒక్క రీమేక్ మూవీ కూడా చేయని దిల్ రాజు మొదటిసారి జాను చిత్రాన్ని రీమేక్ గా తెరకెక్కించాడు. తమిళ క్లాసిక్ హిట్ 96 కి ఆయన తెలుగు రీమేక్ గా జాను చిత్రాన్ని నిర్మిచడం జరిగింది. శర్వానంద్, సమంత వంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా దక్కించుకోలేకపోయింది. శర్వా, సమంత నటనకు మంచి మార్కులు పడినటప్పటికీ కంటెంట్ పరంగా తెలుగు జనాలకు ఎక్కలేదు. ఇక తెలుగులో ట్రాజెడీ ఎండింగ్స్ వర్క్ అవుట్ కావని ఈ చిత్రం మరోమారు నిరూపించింది. దిల్ రాజు కెరీర్ లో చేసిన మొదటి రీమేక్ ప్లాప్ గా నిలిచింది.
కాగా దిల్ రాజు ఖాతాలో మరో రెండు రీమేక్ లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో ఆయన చేస్తున్న చిత్రం రీమేకే. హిందీ హిట్ మూవీ పింక్ కి తెలుగు రీమేక్ గా ఈచిత్రం తెరకెక్కుతుంది. అలాగే తెలుగులో మంచి విజయం అందుకున్న జెర్సీ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. మరి జాను సెంటిమెంట్ కంటిన్యూ అయితే పవన్ కి ప్లాప్ పడినట్లే. కమర్షియల్ అంశాలు అంతగా లేని సోషల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో కూడా అంతగా అంచనాలు లేవు. కాబట్టి పింక్ రీమేక్ రూపంలో దిల్ రాజుని మరో ప్లాప్ పలకరించడం ఖాయం అని ఇండస్ట్రీ టాక్. పవన్ మరి దిల్ రాజుని సెంటిమెంట్ నుండి కాపాడి హిట్ ఇస్తాడో లేక ఆయన సింటిమెంట్ కి బలవుతాడో చూడాలి