Ravi Teja, Balakrishna: ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే.. ‘వీర సింహారెడ్డి’ ప్లాప్ అవుతుందా?

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవేలేదు. సినీ పరిశ్రమ కూడా ఇండస్ట్రీకి పెద్ద పీట వేస్తుంటుంది. సినిమా ప్రారంభించే ముహూర్తం దగ్గర నుండి రిలీజ్ డేట్ వరకు ముహుర్తాలను బట్టే ఫాలో అవుతుంటారు దర్శకనిర్మాతలు. వాళ్లకు మాత్రమే కాదు.. అభిమానులకు కూడా ఈ సెంటిమెంట్ల పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ డేట్ కు, తమ అభిమాన హీరో రిలీజ్ అవుతుంది అంటే ఎంత ఆనందపడతారో.. గతంలో ప్లాప్ పడ్డ నెలల్లో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే అంతే భయపడతారు.

దీని పై సోషల్ మీడియాలో కూడా రకరకాల డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్లతో కూడుకున్న డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’.. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ వంటి పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తరుణంలో వారి అభిమానుల మధ్య తరచూ ఏదో ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా రవితేజ గురించి కూడా ఓ డిస్కషన్ మొదలైంది. అదేంటి అంటే బాలయ్య, రవితేజ… ల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే బాలయ్య సినిమాలు ప్లాప్ అవుతాయట.

‘కృష్ణ’ – ‘ఒక్క మగాడు’, ‘మిత్రుడు’- ‘కిక్’ ఇలా బాలయ్య రవితేజ సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అవుతుంటే బాలకృష్ణ సినిమా ప్లాప్ అవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రకంగా చూసుకుంటే.. ‘వాల్తేరు వీరయ్య’ లో కూడా రవితేజ నటించాడు కాబట్టి.. ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు హైప్ మొత్తం ‘వీరసింహారెడ్డి’ పైనే ఎక్కువగా ఉంది.

‘వాల్తేరు వీరయ్య’ పై అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో రవితేజ- బాలయ్య సెంటిమెంట్ నిజమవుతుందా? అంటే కచ్చితంగా చెప్పలేం. మరోపక్క రవితేజ నుండి ఇటీవల వచ్చిన ‘ధమాకా’ సినిమా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి.. ‘వాల్తేరు వీరయ్య’ కి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus