‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా తర్వాత దాదాపు 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని అనుష్క చేసిన చిత్రం ‘ఘాటి’. ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఆ తర్వాత జూలైకి ఇప్పుడు సెప్టెంబర్ కి వాయిదా పడింది. మొత్తానికి సెప్టెంబర్ 5న విడుదల అంటున్నారు. కానీ మరోపక్క ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ‘ఘాటి’ ట్రైలర్ తో కథపై టీం కొంత క్లారిటీ ఇచ్చింది.
అనుష్క గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటి గా కనిపించింది. అలాగే బస్ కండక్టర్ గా కూడా కనిపించింది. ఈ సినిమాలో అనుష్క లవర్ గా విక్రమ్ ప్రభు..నటించాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఇప్పటి వరకు క్రిష్ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఘాటి ఇంకో ఎత్తు అని తెలుస్తుంది. కథ, కథనాలు అన్నీ చాలా రా అండ్ రస్టిక్ గా క్రిష్ తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అనుష్క ఫ్యాన్స్ కూడా షాకయ్యే సీక్వెన్స్ ఒకటి ఉంటుందట. అదేంటంటే.. ఒక సీన్లో అనుష్క, విక్రమ్ ప్రభు పెళ్ళికి రెడీ అవుతారట. ఆ టైంలో విలన్ గ్యాంగ్ అటాక్ చేస్తారట. ఆ సీన్లో అనుష్కని న*గ్నంగా కట్టేసి దారుణంగా అవమానిస్తారని తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె ప్రియుడు(విక్రమ్ ప్రభు) ని కూడా చంపేస్తారట. ఆ తర్వాత అనుష్క తీర్చుకునే రివేంజ్ మిగిలిన సినిమా అని తెలుస్తుంది. ఇలాంటి షాకింగ్ సీక్వెన్స్ ను అనుష్క అభిమానులు, కామన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపైనే ‘ఘాటి’ ఫలితం ఆధారపడి ఉంటుందని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. చూడాలి మరి..!