Chiranjeevi Marriage: చిరంజీవి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు దశాబ్దాల పాటు నంబర్ 1 హీరోగా కెరీర్ ను కొనసాగించారు. తన నటనతో, ప్రతిభతో చిరంజీవి కోట్ల సంఖ్యలో అభిమానులకు చేరువయ్యారు. చిరంజీవి భార్య పేరు సురేఖ అనే సంగతి తెలిసిందే. పునాదిరాళ్లు సినిమాతో నటుడిగా చిరంజీవి నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

Click Here To Watch

తక్కువ సమయంలోనే నటన, డ్యాన్స్ తో పాపులారిటీని సంపాదించుకుని మెగాస్టార్ చిరంజీవి సత్తా చాటారు. అల్లు రామలింగయ్య చిరంజీవి ప్రతిభను గుర్తించి సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేశారు. 1980 సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తేదీన చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. ఆ సమయంలో చిరంజీవికి సురేఖను ఇచ్చి వివాహం చేయవద్దని చాలామంది అల్లు రామలింగయ్యకు సూచించారు. అయితే చిరంజీవి ప్రతిభను గుర్తించిన అల్లు రామలింగయ్య చిరంజీవి ఉన్నత స్థానానికి ఎదుగుతారని చెప్పారని సమాచారం.

ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన పెళ్లి సమయంలో తాను తాతయ్య ప్రేమ లీలలు అనే మూవీలో నటిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఆ సమయంలో నూతన్ ప్రసాద్ బిజీ ఆర్టిస్ట్ అని చిరంజీవి కామెంట్లు చేశారు. నూతన్ ప్రసాద్ డేట్స్ వల్ల పెళ్లి డేట్ ను వాయిదా వేసుకునే పరిస్థితి వస్తుందని తాను భావించానని అయితే నిర్మాత షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసి పెళ్లికి గ్యాప్ ఇవ్వడం జరిగిందని మెగాస్టార్ అన్నారు.

తాను పెళ్లిపీటల మీద కూర్చునే సమయానికి చొక్కా చిరిగిపోయిందని చిరిగిన చొక్కాను చూసి బట్టలు మార్చుకోవాలని సురేఖ సూచించిందని చిరంజీవి వెల్లడించారు. ఆ తర్వాత బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని చెప్పి తాళి కట్టేశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన పెళ్లి గురించి చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus