సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, రేర్ పిక్స్, షూటింగ్స్, తెరవెనుక ముచ్చట్లు జనాలకెప్పుడూ ఆసక్తికరంగానే అనిపిస్తాయి. ఇక సోషల్ మీడియా అనేది చాలా వరకు ఎంటర్‌టైన్‌మెంట్ వల్లే మరింత పాపులర్ అయిందని కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వల్ల న్యూ అప్‌డేట్స్ అన్నీ తెలుస్తున్నాయి కానీ పాత సినిమాల సంగతులనేవి ఒకోసారి వికీపీడియాలో కూడా కనిపించవు.. 90’s ల కాలంలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నగ్మా, మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
నగ్మా.. అప్పట్లో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. తన అందచందాలతో మగజాతి మతులు పోగొట్టేసింది. 1990లో తన 16వ ఏట.. సల్మాన్ ఖాన్ ‘బాఘీ : ఎ రెబల్ ఫర్ లవ్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది సుమన్ సరసన ‘పెద్దింటి అల్లుడు’తో టాలీవుడ్ ఎంట్రీ.. ఇక అక్కడి నుండి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు లాంటి స్టార్స్ అందరితో సూపర్ హిట్ మూవీస్ చేసింది. హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం..
2000 తర్వాత మరాఠీ, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ భాషల్లో ఓ ఊపు ఊపింది. 2002లో జూనియర్ ఎన్టీఆర్ ‘అల్లరి రాముడు’, సచిన్ జోషి ‘నిను చూడక నేనుండలేను’ (స్పెషల్ అప్పీరియన్స్) ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి.. నగ్మాలది సూపర్ హిట్ పెయిర్.. వీళ్ల కాంబోలో ‘ఘరానా మొగుడు’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘రిక్షావోడు’ సినిమాలొచ్చాయి. నగ్మా తర్వాత ఆమె చెల్లెళ్లు జ్యోతిక, రోషిణి కూడా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. పెద్ద చెల్లి రోషిణి.. చిరంజీవి ‘మాస్టర్’ తో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత బాలయ్య ‘పవిత్రప్రేమ’, శ్రీకాంత్ ‘శుభలేఖలు’ సినిమాలు చేసింది.
ఇక జ్యోతిక తమిళ్‌లో స్టార్ హీరోయిన్ అయ్యాక.. చిరు ‘ఠాగూర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘మాస్’, ‘షాక్’ చిత్రాలు చేసింది. హైలెట్ ఏంటంటే.. నగ్మా ఇద్దరు సిస్టర్స్.. రోషిణి, జ్యోతిక.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య.. నగ్మా, రోషిణిలతో చేస్తే.. నాగార్జున.. నగ్మా, జ్యోతికలతో నటించాడు. ఈ లెక్కన అక్కచెల్లెళ్లతో నటించిన క్రెడిట్ ఒక్క మెగాస్టార్‌కి మాత్రమే దక్కుతుంది. ముగ్గురితోనూ మూవీస్ చేశాడంటే మరి మెగాస్టారా.. మజాకా అనాల్సిందే..
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..