తన ఎందుకు పెళ్ళి చేసుకోలేదో తెలిపిన హీరోయిన్ శోభన..!

సీనియర్ హీరోయిన్ శోభన అందరికీ గుర్తుండే ఉంటుంది. 1984 లో సుమన్ హీరోగా వచ్చిన ‘శ్రీమతి కనుక’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శోభన. ఆ తరువాత వెంకటేష్ తో ‘అజేయుడు’, ‘త్రిమూర్తులు’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ వెంటనే చిరంజీవితో ‘రుద్రవీణ’ , బాలకృష్ణ తో ‘మువ్వగోపాలుడు’, నాగార్జునతో ‘విక్రమ్’ వంటి చిత్రాల్లో నటించింది. మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి అప్పటి టాప్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించింది. తెలుగులో ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది.

ఈమె భారత నాట్యంలో కూడా మంచి ప్రావిణ్యం సంపాదించినదేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికీ ఎన్నో ప్రదర్శనలు ఇస్తూనే ఉంది. మలయాళం నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఈమె వయసు 50 ఏళ్ళకు దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకపోవడం గమనార్హం. దానికి కారణం ఈమె ఓ మలయాళ హీరోని ప్రేమించిందట. కానీ అతను ఈమెకు హ్యాండివ్వడంతో ఇప్పటి వరకూ పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయినట్టు తెలుస్తుంది.

Shocking story behind why actress shobana didn't married yet1

ప్రేమ, పెళ్ళి అనే బంధాలకు దూరంగా ఉండాలి అనే ఈమె ఫిక్సయ్యిందట. అయితే ఈమె ఒంటరిగా ఉండడం లేదు. ఓ పాపను దత్తత తీసుకుని.. ఆమె ఆలనా.. పాలనా చూసుకుంటుంది.ఇదిలా ఉంటే చాలా వరకూ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న శోభన.. ఇటీవల వచ్చిన దుల్కర్ సల్మాన్ ‘వారనే ఆవశ్యముందే’ అనే చిత్రంలో నటించింది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.