RashmikaL: రష్మిక కావాలనే రెచ్చగొడుతుందా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెకి తొలి అవకాశం ఇచ్చింది. ఒక చిన్న మోడలింగ్ ప్రోగ్రామ్ లో రష్మిక పాల్గొంటే.. దానికి సంబంధించిన ఫొటోలు ఓ న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయ్యాయి. వాటిని చూసి దర్శకుడు రిషబ్ శెట్టి, హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి కలిసి రష్మికకు ‘కిరిక్ పార్టీ’ సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రష్మికకి అవకాశాలు పెరిగాయి. అదే సమయంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది రష్మిక. కానీ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. తెలుగులో అవకాశాలు రావడంతో హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయిపోయారు. అయితే కన్నడలో పాపులారిటీ సంపాదించిన తరువాత కన్నడ ఇండస్ట్రీని రష్మిక పట్టించుకోలేదని.. తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చిందని.. కన్నడ సినిమాలను తక్కువ చేసి చూసిందనే విమర్శలు వచ్చాయి. దీంతో కన్నడిగులు ఆమెని తరచూ ట్రోల్ చేస్తుంటారు.

ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ కన్నడిగులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకు తొలి అవకాశం ఎలా వచ్చిందో ఆమె విస్తరిస్తూ.. తనను ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్, నిర్మాతల గురించి ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అన్నట్లుగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. రిషబ్, రక్షిత్ శెట్టిల పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు.

వాళ్ల పేర్లు మర్చిపోయే అంత లేదు. కావాలనే ఆమె అలా ప్రవర్తించిందంటూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిషబ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత, సాయిపల్లవి, రష్మిక లాంటి హీరోయిన్లలో ఎవరితో కలిసి పని చేయడానికి ఇష్టపడతారని అడగ్గా.. అతడు కావాలనే రష్మిక పేరు మినహాయించి మాట్లాడిన వీడియోను షేర్ చేసి.. ఆమెకి కరెక్ట్ పంచ్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus