సినిమా వీడియో బిట్, టీజర్, ట్రైలర్, పాట… ఇలా ఏది వచ్చినా అందులో తప్పులు వెతకడానికి, కాపీనా అని చూడటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏదైనా పాయింట్ దొరికిందా ఆ సినిమా టీమ్‌ను ఏకిపారేస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితి ‘శ్యామ్ సింగ రాయ్’కి వచ్చింది. సినిమా ట్రైలర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో నాని బెంగాళీలో ఓ పెద్ద డైలాగ్ చెప్పాడు. దానికి తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి కింద స్క్రోల్‌లా వేశారు.
అలా వేసిన ట్రాన్స్‌లేట్‌లో ఓ అక్షర దోషం ఇప్పుడు సినిమా యూనిట్‌ను సోషల్ మీడియాలో ఏకిపారేస్తోంది. ట్రైలర్‌లో ‘స్త్రీ ఎవడికీ దాసి కాదు… ఆఖరికి ఆ దేవుడికి కూడా. ఖబడ్దార్’ అనే ఓ డైలాగ్ బెంగాళీలో చెబుతాడు. దానిని ఆ సినిమా టీమ్ తెలుగులో ట్రాన్స్ లేట్ చేసి… దిగువ స్క్రోల్‌లా వేసింది. అయితే అందులో ఎవడికీ బదులు… ఎవడికి అని రాసింది. దీంతో ఒక్కసారిగా డైలాగ్ అర్థం మారిపోయింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఇదో చర్చ.
తెలుగు చక్కగా రానివాళ్లు సినిమాలు రాస్తారని, డైలాగ్‌లు రాస్తారని మనం అనుకోం. కాబట్టి సినిమా టైటిల్స్, టెక్స్ట్ పెట్టేవాళ్లు ఈ పని చేసి ఉండాలి. ఇలా అర్థం మారిపోతే ఏ డైలాగ్ అయినా కష్టమే. ఎవరికైనా కష్టమే. మరి చిత్రబృందం దీనిపై ఎలా స్పందించి… ఎలా ముందుకెళ్తుందో చూడాలి. సినిమాకి వచ్చేసరికి ఆ స్క్రోలింగ్ మారుస్తారనే ఆశిద్దాం. చూశారా ఒక తప్పు ఎంత పని చేసిందో.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!