Neha Chowdary: వాళ్లిద్దరి వల్లనే నేహా ఎలిమినేట్ అయ్యిందా ? అసలు మేటర్ ఏంటంటే..?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తే , ఎలిమినేషన్ మాత్రం హౌస్ మేట్స్ కి షాక్ ఇస్తుంది. ప్రస్తుతం సీజన్ 6లో మూడోవారం బయటకి వచ్చిన నేహా ఎలిమినేషన్ పై పెద్ద రచ్చ చేస్తోంది. కేవలం ఇద్దరి వల్లే నేను ఎలిమినేట్ అయ్యాయని చెప్తోంది. నిజానికి నేహా ఎలిమినేట్ అయ్యేటపుడు రేవంత్ ని ఉద్దేశ్యించి కామెంట్స్ చేసింది. నేను నమ్మినవాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారు అంటూ మాట్లాడింది.

కేవలం వాళ్లిద్దరూ నామినేట్ చేయడం వల్లే తను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని బాధపడింది. అంతేకాదు, హౌస్ నుంచీ వచ్చిన తర్వాత కూడా దమ్ము , దుమ్ము అనే టాస్క్ లో రేవంత్ గురించి మాట్లాడింది కూడా. దుమ్ములో పెడుతూ హౌస్ లో నేను బాగా ఫ్రెండ్షిప్ చేశానని, బాండింగ్ వచ్చిన టైమ్ లో నామినేట్ చేసి కనెక్షన్ కట్ చేశాడని వాపోయింది. తర్వాత రాజ్ ని బాగా మిస్ అవుతానని రాజ్ తో మంచి బాండింగ్ ఉందని చెప్పింది నేహా.

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం నేహాకి కేవలం రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి. వాసంతీ, ఇంకా రేవంత్ ఇద్దరూ కూడా నామినేట్ చేశారు. వాసంతీ నాకు వేస్ట్ స్టాంప్ ఎలా వేస్తావ్ అంటూ ఆర్గ్యూమెంట్ చేసింది. ఇక్కడ వాసంతీకి చాలాసేపు నేహా ఎక్స్ ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. వీరిద్దరి ఆర్గ్యూమెంట్ అనేది నేహా గేమ్ ని దెబ్బకొట్టింది. ఆ తర్వాత రేవంత్ కూడా రెచ్చిపోయి నేహాపై అరిచాడు. నామినేట్ చేశాడు. రాంగానే కన్నింగ్ ట్యాగ్ ఇచ్చావన్నాడు.

ఆ తర్వాత రేవంత్ తనతో జోక్ గా అన్నమాటలు అన్నీ బయటపెట్టింది. పునుగులు, నూడుల్స్ ఇలా రేవంత్ తనపై జోక్స్ వేస్తుంటే తీస్కోలేనని ఖరాఖండిగా చెప్పింది. అప్పట్నుంచీ గేమ్ లో రేవంత్ అండ్ వాసంతీలకి దూరంగా ఉంది. అంతేకాదు, దొంగల టాస్క్ లో రేవంత్ బొమ్మలు కొట్టేయడం వల్ల కూడా నేహా గేమ్ కి దూరం అయిపోయింది. ఇప్పుడు వీళ్లిద్దరి వల్లనే నేహా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తోంది.

నేహా ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కేవలం వాళ్లిద్దరి వల్లే కాదని, నేహాకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేకపోవడం వల్లే ఎలిమినేట్ అయ్యిందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక నేహా బిగ్ బాస్ బజ్ లో యాంకర్ శివకి ఇచ్చిన ఇంటర్య్వూలో ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇంటర్య్వూ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus