Anchor Ravi: యాంకర్ రవి డబుల్ గేమ్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో యాంకర్ రవి ఒకరు. మెచ్యూర్డ్ గా గేమ్ ఆడుతూ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే తాజాగా రవి తన వివాదాస్పద ప్రవర్తనతో ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ప్రియా.. లహరిని నామినేట్ చేస్తూ ఆమె హౌస్ లో మగాళ్లతో ఎక్కువగా ఉంటుందని.. యాంకర్ రవిని అర్ధరాత్రి బాత్రూమ్ దగ్గర హగ్ చేసుకుందంటూ కీలకవ్యాఖ్యలు చేసింది. రవిని తను బ్రదర్ అని పిలుస్తానని.. తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నారంటూ లహరి.. ప్రియాతో గొడవకు దిగింది.

ఈ విషయంలో రవి కూడా సీరియస్ అయ్యాడు. ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారని ప్రియాపై మండిపడ్డాడు రవి. తన కూతురికి ఈ స్టేట్మెంట్ అర్ధమైతే ఏమనుకుంటుందని రవి ఎమోషనల్ అయ్యాడు. లహరి కూడా ఈ విషయంలో ఏడ్చేసింది. ప్రియా వీరిద్దరికీ సారీ చెప్పినప్పటికీ.. జరిగింది మాత్రం నిజమని.. తన కళ్లతో తాను చూశానని.. చూసిందే మాట్లాడానని చెప్పింది. ప్రియా చెప్పిన విధానం కరెక్ట్ కాదంటూ హౌస్ మేట్స్ అందరూ కూడా ఆమెనే బ్లేమ్స్ చేశారు.

ఆ తరువాత లహరి.. రవి దగ్గరకు వెళ్లి.. ”నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నా.. అందుకే నీ హెల్ప్ కోసం నీ వెనుక పడుతున్నా.. హౌస్‌లో పెళ్లి కాని వాళ్లు చాలామంది ఉన్నప్పటికీ లహరి నా వెనుకే పడుతుంది.. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు” అనే మాటలు మీరు ప్రియా దగ్గర అన్నారా..? అని అడగ్గా.. తను తప్పుగా అనలేదని రవి చెప్పాడు. వెంటనే ప్రియా.. ‘సింగిల్ మెన్ అనే మాట నీ నోటి నుంచి వచ్చింది బ్రో’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ విషయంలో అబద్ధం చెప్పింది ఎవరనే విషయంపై ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రవి.. క్లియర్ గా లహరి గురించి ప్రియాతో మాట్లాడాడు. లహరి తనతో ఎక్కువ టైమ్ ఉండడానికి ప్రయత్నిస్తుందని.. సింగిల్ మెన్ అనే పదాలు రవి వాడినట్లు క్లియర్ గా తెలుస్తుంది. కానీ రవి మాత్రం సింగిల్ మెన్ అనే పదాన్ని వాడలేదని బుకాయిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో నెటిజన్లు రవిపై ట్రోల్స్ వేస్తూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus