Sowmya Rao: ‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్యారావు పై ట్రోలింగ్ కారణం అదే..?

‘జబర్దస్త్’..ఖతర్నాక్ కామెడీ షో. ఈ టీవీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. మొదట్లో సినిమాల్లో చిన్న చితకా పాత్రలు వేసుకుని గుర్తింపు తెచ్చుకోలేకపోతున్న కమెడియన్లకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ షో. అటు తర్వాత జూనియర్ ఆర్టిస్టులను కూడా స్టార్ లను చేసేసింది.’బిగ్ బాస్’ కంటే కూడా ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టే షో ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ షోలో స్కిట్స్ ఎంత ఫేమసో.. యాంకర్లు అయిన అనసూయ, రష్మి ల గ్లామర్ కూడా అంతే ఫేమస్..!

అయితే కొన్ని కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ మానేసింది.కొద్దిరోజులకు అనసూయ ప్లేస్ లోకి కన్నడ బ్యూటీ సౌమ్యా రావు వచ్చిన సంగతి తెలిసిందే. పలు సీరియల్స్ లో నటించి పాపులర్ అయిన ఈమెను జబర్దస్త్ కు తీసుకొచ్చారు. అనతికాలంలోనే ఈమె కూడా పాపులర్ అయిపోయింది. అయితే ఈమెకు కూడా రష్మీలా తెలుగు ఎక్కువగా రాదు. కానీ ఈమె మాటలు చిన్నపిల్లల మాటలు మాదిరి ముద్దు ముద్దుగా ఉంటాయని అంతా అంటుంటారు.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈమె ట్రోలింగ్ కు గురయ్యింది. విషయం ఏంటి అంటే ఈమె ఓ పాటకు డాన్స్ చేసింది. ఆమె చేసిన డాన్స్ చూస్తే వచ్చి రానట్టే ఉందని చెప్పాలి. అందుకే ‘ఇదేం డాన్స్ మేడం, లైఫ్ లో ఇంకెప్పుడూ డాన్స్ చేయకండి, హ్యాపీగా జబర్దస్త్ చేసుకోక ఎందుకు మీకీ తిప్పలు’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus