Bigg Boss Telugu 6: షానీకి ఒక న్యాయం, అభికి ఇంకోన్యాయం ఈ తేడా ఎందుకు జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్ లో షానీని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ టీమ్, ఆదివారం ఎపిసోడ్ లో అభినయశ్రీని ఎలిమినేట్ చేశారు. మొదటి వారం ఎలిమినేషన్ లేకపోవడం వల్లే రెండోవారం డబుల్ ఎలిమినేషన్ అనేది చేయాల్సి వచ్చింది. ఇక్కడే బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ విషయంలో పెద్ద తప్పు చేశారండూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. షానీని జస్ట్ లైక్ దట్ ఎలిమినేట్ చేసేసి, అభినయశ్రీని మాత్రం పద్దతిగా ఎలిమినేట్ చేయడం అనేది కొంతమందికి నచ్చడం లేదు.

మొదటి వారంలోనే అభినయశ్రీ ఎలిమినేట్ అయిపోవాల్సింది. కానీ, బిగ్ బాస్ సేఫ్ చేశాడు. ఈవిషయం అభినయశ్రీ జెర్నీ చూస్తుంటే అర్ధమయిపోయింది. కేవలం మొదటి వారం వరకూ మాత్రమే వ్యూజవల్స్ వచ్చాయి. కానీ, షానికి పెద్ద అన్యాయం జరిగింది. కనీసం స్టేజ్ పై తగిన మర్యాద కూడా లభించలేదు. నాగార్జున హాయ్, బై చెప్పేసి పంపించేశారు. కనీసం జెర్నీ కూడా చూపించలేదు. దీంతో ఇదెక్కడి న్యాయం బిగ్ బాస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ ఫస్ట్ వీక్ పద్దతిగా అభినయశ్రీ ఎలిమినేట్ అయిపోవాలి. కానీ, కావాలనే బిగ్ బాస్ టీమ్ అభినయశ్రీకి మరో ఛాన్స్ ఇచ్చింది. కానీ, రెండోవారం కూడా అభి నామినేషన్స్ లోకి వచ్చింది. షానీ కూడా అభితో పాటుగా ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నాడు. అభి – షానీ ఒకరికొకరు నామినేట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు షానీని ఎలిమినేట్ చేసిన పద్దతిని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం టీఆర్పీ రేటింగ్స్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అనూహ్యంగా ఇలా ఎలిమినేషన్ చేయడం, హౌస్ మేట్స్ కి ఫుల్ గా క్లాస్ పీకి ఇండైరెక్ట్ గా కొట్టుకోమని సలహాలు ఇవ్వడం వల్లే ఈ ఎలిమినేషన్ జరిగిందని చెప్తున్నారు.

షానీ నిజంగా లీస్ట్ లో ఉంటే పద్దతిగా ఎలిమినేట్ చేసి ఉంటే బాగుండేది కదా అని అంటున్నారు. ఎలిమినేషన్ విషయంలో అభికి ఒక న్యాయం, షానీకి ఒక న్యాయమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అప్పటికప్పుడు డబుల్ ఎలిమినేషన్ అనుకోవడం వల్లే ఇలా జరిగిందని, నిజానికి అభినయశ్రీ లీస్ట్ ఓటింగ్ లో ఉందని, అందుకే ఆమె జెర్నీ మాత్రమే కట్ చేసి చూపించారని బిగ్ బాస్ రివ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా షానీకి మాట్లాడే అవకాశం అయినా ఇచ్చి ఉండాల్సిందని, మరొక్కవారం ఉండి ఉంటే బాగా గేమ్ ఆడేవాడని షానీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus