ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి వల్ల గజ గజ వణికిపోతోంది. అమెరికా వంటి దేశాల్లో వేల మంది మరణిస్తున్నారు. ఇలాంటి టైం లో లాక్ డౌన్ మాత్రమే నివారణ మార్గంగా ప్రభుత్వాలు ఎంచుకుంటూ వస్తున్నాయి. పోలీసులు, వైద్యులు పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి టైములో సెలబ్రిటీలు సైతం ఇళ్ళలోనే ఉంటూ తమ అభి మానులను కూడా ఇంటి నుండీ బయటకి రావొద్దు అంటూ తమ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.
అయితే రిచా గంగోపధ్యాయ్ మాత్రం తన భర్త తో కలిసి పిక్నిక్ కు వెళ్ళింది దీంతో ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… “కొన్ని వారాలుగా ఇంట్లోనే ఉంటూ దూరంగా ఉండటం అంటే సాధారణ విషయం కాదు. ఒక్కో సమయంలో ఏదైనా అత్యవసర సామాగ్రిని కొనడానికి మాత్రమే వచ్చేవాళ్ళం. అయితే చాలా రోజుల తరువాత ఇప్పుడు మేమిద్దరం ఓరెగాన్ నది వద్దకు వచ్చాం.
ఇక్కడ కూడా సామజిక దూరం పాటిస్తున్నాం” అంటూ తన పేర్కొంది.’ఓ సెలబ్రిటీ అయ్యుండి లాక్ డౌన్ టైములో బయటకి రావడం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తుంటే. మరికొంత మంది ఈమెను తిట్లు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు.గత ఏడాదే ఈ బ్యూటీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె తెలుగులో రవితేజ సరసన ‘మిరపకాయ్’ ‘సారొచ్చారు’, రానా సరసన ‘లీడర్’, ప్రభాస్ సరసన ‘మిర్చి’ వంటి చిత్రాల్లో నటించింది.