Ravi Teja: టీంతో చాట్ చేసి అభిమానులతో చాట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చాడా?

గతేడాది ‘ఖిలాడీ’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలతో రెండు ప్లాపులిచ్చిన రవితేజ.. అటు తర్వాత ‘ధమాకా’ తో 2022 కి మంచి గుడ్ బై చెప్పాడు. అటు తర్వాత అంటే 2023 ఆరంభంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘రావణాసుర’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై పెద్దగా బజ్ లేదు. టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి కానీ..

అది మాస్ ఆడియన్స్ కు రీచ్ అయ్యే విధంగా లేదు. రవితేజకి మాస్ అనేది ప్లస్ పాయింట్.ఆ సినిమా గురించి చిత్ర బృందాన్ని ఏమైనా ప్రశ్నిస్తే అంతా థియేటర్లోనే చూడండి అంటున్నారు. సినిమా గురించి ఏదీ కూడా రివీల్ చేయడం లేదు.ఇదిలా ఉంటే… రవితేజ నిన్న #AskRavanasara అంటూ ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. రవితేజ సినిమాల టైంలో తప్ప మిగిలిన టైంలో అభిమానులకు కానీ మీడియాకి కానీ అందుబాటులో ఉండడు.

వేరే ఏ సినిమా ఈవెంట్ లలో కూడా కనిపించడు. కాబట్టి రవితేజ (Ravi Teja) అభిమానులు ట్విట్టర్ లో రవితేజతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎగబడ్డారు. కానీ రవితేజ మాత్రం ‘రావణాసుర’ సినిమాకి సంబంధించిన ప్రశ్నలకి తప్ప వేరే ఏ ప్రశ్నకి కూడా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇది రవితేజ తన టీంతో ప్రశ్నలడిగించుకుని వాటికే ఆన్సర్లు ఇచ్చుకున్నాడు అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus