సిల్క్ స్మిత బయోపిక్ దరిదాపులకు షకీలా సినిమా రాలేకపోయింది

మలయాళ టాప్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టిలను కూడా భయపెట్టిన ఘనత ఉన్న ఏకైక లేడీ షకీలా. అప్పట్లో షకీలా సినిమాలు మలయాళంలో థియేటర్లో విడుదలవుతున్నాయంటే జనాలు క్యూ కట్టేవారు, స్టార్ హీరోలు తమ సినిమాను పోస్ట్ పోన్ చేసుకొనేవారు. ఒక నటిగా ఆమె గ్లామర్ తో షకీలా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అటువంటి నటిపై సినిమా అంటే అందరికీ మంచి ఆసక్తి ఉండడం సహజం. అందులోనూ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన “డర్టీ పిక్చర్” కొల్లగొట్టడంతోపాటు..

క్రిటిక్స్ ను కూడా ఆకట్టుకున్న నేపథ్యంలో షకీలా బయోపిక్ మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. షకీలా పాత్రకు రిచా చడ్డాను ఎంపిక చేసి ఆదిలోనే ఇంట్రెస్ట్ అనేది తగ్గించేశారు మేకర్స్. ఆ తర్వాత విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇలా ఏదీ సెన్సేషన్ కాదు కదా, కనీస స్థాయి ఆసక్తి కూడా రేకెత్తించలేకపోయింది. ఇక గతవారం విడుదలైన సినిమా చూసిన జనాలందరూ ఇదేం సినిమారా బాబు అని నెత్తిన చేతులెసుకున్నారు.

షకీలా బయోపిక్కును మరీ ఇంత వరస్ట్ గా తీయాలా అని బాలీవుడ్ క్రిటిక్స్ సైతం స్పందించారంటే సినిమా ఎంత చెత్తగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. షకీలా ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో చెప్పునట్లు తన బయోపిక్ ను తానే డైరెక్ట్ చేయడం బెటరేమో అనిపించింది.


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus