Hero: మరీ దిగజారిపోతున్నారు..ఒకప్పటి హీరో పై ఘోరమైన ట్రోల్స్!

హీరో ఆదిత్య ఓం అందరికీ గుర్తుండే ఉంటాడు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంతో ఇతను హీరోగా పరిచయమయ్యాడు. వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే సినిమాలో ఫైట్లు అన్నీ నందమూరి హరికృష్ణ తోనే చేయించాడు దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి. ఇతన్ని హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం చేశాడు. అందువల్ల సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఇతనికి పేరొచ్చింది ఏమీ లేదు. కానీ కాస్త పేరున్న సినిమాల్లో అవకాశాలు సంపాదించగలిగాడు.

డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు తెరకెక్కించాడు. అందులో హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఆదిత్య ఓం హీరోగా నటించిన ‘దహనం’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి కూడా తెలిసుండదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న టైంలో ఆదిత్య ఓం కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆదిత్య ఓం మాట్లాడుతూ.. “నా కెరీర్లో చాలా గ్యాప్ రావడంతో విపరీతమైన ట్రోలింగ్ కు కూడా గురయ్యాను.

సోషల్ మీడియాలో ‘మీరు బతికే ఉన్నారా?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేసేవారు. అప్పట్లో చాలా డిప్రెషన్లో ఉండేవాడిని. రోజుకు దాదాపు 60 సిగరెట్లు తాగేవాడిని. కానీ 2017 ఇకపై ఎప్పుడు ధూమపానం, మద్యపానం చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను.ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడంతో ఆ డిప్రెషన్ నుండి పూర్తిగా కోలుకున్నాను. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే..సినిమా రంగంలో ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాల్సిందే.

ప్రశంసలకు పొంగిపోకూడదు.. విమర్శలకు కుంగిపోకూడదు అని” అంటూ (Hero) చెప్పుకొచ్చాడు. నిజంగా సోషల్ మీడియాలో కొంతమంది భయంకరమైన కామెంట్లు పెడుతూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. సక్సెస్ అనేది అన్ని వేళలా అందరి వెనుక ఉండదు. చివరికి మనం మంచి హ్యూమన్స్ అనిపించుకోవాలి.. ఇలా మాత్రం దిగజారకూడదు అంతే…! ఇక ఆదిత్య ఓం ప్రస్తుతం సినిమాల పై ఫోకస్ పెట్టాడు. అలాగే పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus