Mahesh Babu, Jr NTR: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కు డిజాస్టర్ రేటింగ్..!

జూ.ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి మహేష్ బాబు కూడా గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఎప్పటినుండో జెమినీ వారు ఈ షోకి ప్రచారం చేస్తూ వస్తున్న జెమినీ వారు.మహేష్ బాబు తర్వాత రాజమౌళి, సమంత, కొరటాల శివ,దేవి శ్రీ ప్రసాద్, తమన్ వంటి వాళ్ళు కూడా ఎపిసోడ్ కు గెస్ట్ లుగా హాజరయ్యారు. కానీ మహేష్ బాబు ఎపిసోడ్ ను చివరి వరకు పెట్టుకుని ఊరిస్తూ ఊరిస్తూ వదిలారు నిర్వాహకులు.

దాంతో ఈ ఎపిసోడ్ కు భారీ టి.ఆర్.పి రేటింగ్ నమోదవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే దీనికి ఘోరమైన రేటింగ్ నమోదైంది. ‘అదిరిపోయింది సెటప్ అంతా’ అంటూ మహేష్ బాబు… ‘మహేష్ అన్నా’ అంటూ ఎన్టీఆర్ ఎంత ఉత్సాహం చూపించినా ఈ ఎపిసోడ్ కు మంచి రేటింగ్ ను తెప్పించలేకపోయారు. ఇంత లేట్ గా కాకుండా షూటింగ్ అయిన వెంటనే కనుక ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేస్తే

మంచి టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యేదేమో కానీ ఇప్పుడు కేవలం 4.9 టి.ఆర్.పి రేటింగే నమోదైంది. బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అంటూ జెమినీ వారు ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలని టెలికాస్ట్ చేస్తూ వచ్చారు. కానీ డిజాస్టర్ రేటింగ్ నమోదైంది. అయితే సన్ నెక్స్ట్ లో ఈ ఎపిసోడ్ కు మంచి వ్యూయర్ షిప్ నమోదైందని వినికిడి. ఎక్కువ మంది అక్కడ చూసుకోవచ్చులే అనే ఉద్దేశంతో టీవీల్లో లైట్ తీసుకున్నారని స్పష్టమవుతుంది.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus