కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం.. లాక్ డౌన్ ముగిసినప్పటికీ 50 శాతం ఆకుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ.. సినిమాలు విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు భయపడుతున్న రోజులవి. అయితే మొత్తానికి సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీం ధైర్యంగా ముందడుగు వేశారు. సుబ్బు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలయ్యింది. ప్రేక్షకులు కూడా ఎగబడి థియేటర్లకు వచ్చి ఈ చిత్రాన్ని విజయవంతం చేశారు.
వారం రోజులకు డిజిటల్ రిలీజ్ చేసినా.. థియేటర్లలో మాత్రం వసూళ్లు తగ్గలేదు అంటే.. ఆశ్చర్యం కలిగించే విషయం. మొత్తానికి ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి హిట్ల తరువాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేసాడు తేజు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఇప్పుడు టీవీల్లో కూడా హిట్ కొట్టింది. గతవారం ఈ చిత్రం ప్రీమియర్ ను జి తెలుగు వారు టెలికాస్ట్ చెయ్యగా.. మంచి టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు ఈ చిత్రం 6.72 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. మొదటి వారానికే డిజిటల్ రిలీజ్ ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రాన్ని బుల్లితెర పై కూడా అధరించారు పేక్షకులు.ఈ చిత్రం శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిన జి తెలుగు వారు ఇప్పటికే మొత్తం రికవరీని సాధించారట. రెండో సారి నుండీ టెలికాస్ట్ చేస్తే వచ్చేది అంతా ప్రాఫిట్స్ అనమాట..!
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!