బుల్లితెర నటి సౌజన్య సూసైడ్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నటుడు వివేక్ ప్రేమ, పెళ్లి పేరుతో వేధించడం వలన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి ప్రభు మాదప్ప ఆరోపించారు. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేష్ లపై కుంబళగోడు పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు అమాయకురాలిని.. ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తన కూతురు దగ్గర ఉన్న బంగారం, డబ్బులు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలంగా తన కూతురితో పరిచయం ఉందని ప్రభు అన్నారు. తన కూతురిని ప్రేమించాలని వివేక్ వేధించినట్లుచెప్పుకొచ్చారు . పోలీసులు వచ్చేలోపు ఘటనా స్థలం నుంచి తన కూతురు మృతదేహాన్ని నిందితుడు మార్చాడని ఆరోపిస్తున్నారు. తన కూతురి ఫోన్ కూడా కనిపించడం లేదని అన్నారు. ఫోన్ దొరికితే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన వివేక్.. ఇప్పుడు తానేమి చెప్పలేనని, నటి సౌజన్య తనకు ఏడాదిగా తెలుసని అన్నాడు.
ఆమె చాలా అమాయకురాలిని అన్నాడు. సౌజన్య ఒత్తిడికి గురైనప్పుడల్లా తన బాధను నాతో చెప్పుకునేదని వివేక్ చెప్పుకొచ్చాడు. మరోపక్క సౌజన్య రూమ్ లో దొరికిన సూసైడ్ నోట్ లో తన మానసిక స్థితి బాగాలేదని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది.