Adipurush: ఆదిపురుష్ రిలీజ్ విషయంలో షాకింగ్ ట్విస్ట్.. ఏమైందంటే?

ప్రభాస్ కృతిసనన్ ప్రధాన పాత్రల్లో ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ నుంచి విడుదలైన టీజర్ కు క్రిటిక్స్ నుంచి, సామాన్య ప్రేక్షకుల నుంచి, ప్రభాస్ అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. ఆదిపురుష్ గ్రాఫిక్స్ లో మార్పులు చేయకుండా సినిమాను విడుదల చేస్తే సినిమా డిజాస్టర్ కావడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం. అయితే ఊహించని స్థాయిలో ట్రోల్స్ రావడంతో మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఆరు నెలల పాటు వాయిదా వేశారు.

అయితే సినిమాకు సంబంధించి చాలా మార్పులు చేయాల్సి ఉండటంతో ఈ సినిమా విడుదల కావాలంటే 2024 వరకు ఆగాల్సిందేనని సమాచారం. ప్రాజెక్ట్ కే విడుదలైన తర్వాత ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు భారీ మొత్తంలో బడ్జెట్ ఖర్చు కావడంతో సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యే కొద్దీ మేకర్స్ పై ఊహించని స్థాయిలో భారం పెరిగే అవకాశం అయితే ఉంది.

2023లో ఆదిపురుష్ రిలీజ్ కాకపోవడం అంటే అభిమానులకు భారీ షాక్ అనే చెప్పాలి. ప్రభాస్ ప్రాజెక్ట్ చాలాసార్లు రిలీజ్ డేట్ ను మార్చుకోవడం అభిమానులను ఒకింత హర్ట్ చేస్తోంది. అయితే ఆదిపురుష్ వాయిదా గురించి మేకర్స్ కూడా స్పందించాల్సి ఉంది. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు వాయిదా పడటం అంటే ఆ సినిమా బిజినెస్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఆదిపురుష్ గురించి అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రభాస్ క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

ప్రభాస్ సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఇలాంటి సమస్య రాలేదు. ఆదిపురుష్ సినిమాను ఏ క్షణం మొదలుపెట్టారో తెలీదు కానీ ఈ సినిమాకు ఆటంకాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus