‘ఆర్.ఆర్.ఆర్’ ఇంత సింపుల్ గానా..?

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ చిత్రంకు టైటిల్ కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉండేలా చూసుకోవాలి..! ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. మరి అసలు టైటిల్ ఏంటి.. అనుకుంటున్న తరుణంలో ఓ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు రాజమౌళి చెప్పుకొచ్చాడు. మీరే టైటిల్స్ పంపించండి.. అందులో ఏదైనా నచ్చితే అదే ఫిక్స్ చేస్తాం’ అని కూడా రాజమౌళి చెప్పాడు.

అలాంటిది కనీసం అనౌన్స్మెంట్ కూడా లేకుండా.. దసరా రోజున ‘ఆర్.ఆర్.ఆర్’ టైటిల్ ‘రామ రౌద్ర రుషితం’ అని సోషల్ మీడియాలో పోస్టర్ వచ్చింది. ఆ టైటిల్ లో రామ అంటే అల్లూరి సీతారామరాజు అని అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్ రాంచరణ్ చేస్తున్నాడు కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ రౌద్ర, రుషితం అంటే ఏమిటి అనే కన్ఫ్యూజన్ ఏర్పడింది. పైగా ఇక్కడ కొమరం భీం ను వర్ణిస్తున్నట్టు లేదు. అందులోనూ పవర్ఫుల్ గా కూడా అనిపించడం లేదు… అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇది కేవలం ‘ఫ్యాన్ మేడ్’ పోస్టరే అని తేలిపోయింది.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus