దర్శక ధీరుడు రాజమౌళి చెక్కే సినిమాలు ఏళ్ళ తరబడి షూటింగ్స్ జరుపుకుంటాయి. అలాగే వాటి నిడివి కూడా కొంచెం సుదీర్ఘంగానే ఉంటుంది. ఆయన గత చిత్రం బాహుబలి 2 నిడివి ఏకంగా 171 నిమిషాలుగా ఉంది. ఇంత సుదీర్ఘంగా ఉంటే సినిమా ఎవరు చూస్తారు అనే ఆరోపణలు వచ్చినా ఆయన లెక్క చేయలేదు. పట్టుసడలని స్క్రీన్ ప్లే ఆసక్తి గొలిపే సన్నివేశాలతో సాగే ఆయన సినిమాల నిడివి ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరు. ఇక ఆర్ ఆర్ ఆర్ నిడివి బాహుబలి 2కి మించి ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో వారిద్దరి ఇమేజ్ కి తగ్గట్టుగా క్యారెక్టర్స్ డెవలప్ చేసి, ఆకట్టుకునే ముగింపు ఇవ్వడానికి ఎక్కువ సన్నివేశాలు తెరకెక్కించే అవకాశం ఉంది. అలాగే ఈ చిత్రంలో దాదాపు 10 పాటలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఒక్క సుద్దాల అశోక్ తేజ మూడు పాటలు రాసినట్టు స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఏవిధంగా చూసినా ఆర్ ఆర్ ఆర్ నిడివి 3 గంటలకు మించి ఉండడం ఖాయం అని కొందరు అంచనా వేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. రాజమౌళి చారిత్రక పాత్రలకు ఫిక్షన్ జోడించి ఈ చిత్రం తెరకెక్కిస్తుండగా, చరణ్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన ఆయన ఇంట్రడక్షన్ వీడియో అంచనాలు మించి వుంది. దీనితో మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పరిచయ వీడియో ఈ రేంజ్ ఉండనుండో అని ఫ్యాన్స్ ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!