శ్రద్దా శ్రీనాథ్.. పేరు విషయంలో ఇంతలా విరుచుకుపడిందేంటి..!

శ్రద్ధా శ్రీనాథ్, శ్రద్ధా దాస్, శ్రద్దా కపూర్…ఈ ముగ్గురూ క్రేజ్ ఉన్న హీరోయిన్లే..! వీళ్ళ ముగ్గురికి అధికారిక ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి. వీళ్ళని ట్యాగ్ చేసే క్రమంలో ఎవ్వరూ కన్ఫ్యూజ్ కారు. కానీ ఓ మీడియా కన్ఫ్యూజ్ అయ్యింది. అందులో తప్పేమీ లేదు. చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా చోటు చేసుకుంటాయి. విషయంలోకి వెళితే.. ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ గ్లామర్ ఫోటోను షేర్ చేసిన ఓ మీడియా.. శ్రద్దా శ్రీనాథ్ కు బదులు శ్రద్దా దాస్ అని పేర్కొంది.

దీంతో శ్రద్దా శ్రీనాథ్ కి కోపం వచ్చి ఆ మీడియా పై మండి పడింది.’కనీసం ఆ మాత్రం తెలీదా?.. మీకు 861K ఫాలోవర్లు ఎలా ఉన్నార్రా బాబు’ అంటూ తన కడుపుమంట బయటపెట్టింది. ఆ తర్వాత తన ట్విట్టర్లో.. “నా పేరుని ఎవరైతే కరెక్ట్‌గా పలుకుతున్నారో, రాస్తున్నారో వారందరికీ థ్యాంక్స్. దాస్ లేదా కపూర్ అని మీ కీబోర్డ్ చూపిస్తున్నా కూడా నా పేరుని కరెక్ట్‌గా రాస్తున్నారు అంటే మీకు థాంక్స్ చెప్పాల్సిందే. శ్రీనాథ్ అనేది అసలైన పేరు అని మీ మనసులోకి వస్తుందంటే అది చాలు..

మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు అదే నిదర్శనం.ఇన్స్టాగ్రామ్ లో నా పేరుని శ్రద్దా రామా శ్రీనాథ్ అని మార్చుకున్నాను. రామా అంటే మా అమ్మ పేరు.. ఇక్కడ కూడా అలానే మార్చుకోవాలా? ఇకపై ఎప్పుడూ కూడా నేను శ్రద్దా రామా శ్రీనాథ్‌గానే పరిచయం చేసుకుంటాను. ఇక ముందు చూడండి. దీనిపై మీరేమి అంత బాధపడకండి.. ఇది నాకు నేనుగా అనుకుంటున్నాను.శ్రద్దా శ్రీనాథ్ అని నన్ను పిలవండి అదే చాలు.. దాస్ కపూర్ అని యాడ్ చేయకండి..

పెద్ద పెద్ద మీడియా సంస్థలు, ఇంత మంది ఫాలోవర్స్ ఉన్న వారు కూడా కనీసం నా పేరు తెలీకుండా రాసేస్తున్నారు.. నాకు తెలిసి మీరెప్పుడూ కూడా జర్నలిజం స్కూల్‌లో క్లాసులు కూడా వినుండరు’ అంటూ ఓ రేంజ్లో మండిపడింది జెర్సీ బ్యూటీ. ఒకరి క్రెడిట్ ఇంకొకరికి వెళ్తుంది అంటే ఎవ్వరికైనా కోపం వస్తుంది. శ్రద్దా శ్రీనాథ్ కు కోపం చాలా ఎక్కువని కొంతమంది దర్శకనిర్మాతలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. పై అంశాన్ని బట్టి అది నిజమే అని స్పష్టమవుతుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus