ఈ ఏడాది చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోల నుండి చూసుకుంటే వరుణ్ తేజ్, శర్వానంద్ ,,లు ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెరకి చెందిన సెలబ్రిటీలు కూడా పెళ్లి పీటలు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి.మానస్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. అలాగే జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే కృష్ణ ముకుంద మురారి హీరోయిన్.. ఇంకా అనేక మంది బుల్లితెర సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ..
హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలు కూడా షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి శ్రెను పరీఖ్ తన సహ నటుడు అక్షయ్ మాత్రే ని ప్రేమించి సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్’ సీరియల్ ద్వారా శ్రెను పరిఖ్ బాగా పాపులర్ అయ్యింది.
‘ఘర్ ఏక్ మందిర్ కృపా అగ్రసేన్ మహరాజా కి’ అనే సీరియల్లో అక్షయ్ మాత్రేతో ఈమె కలిసి నటించింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో.. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి, ఫైనల్ గా పెళ్లి పీటలు ఎక్కినట్టు స్పష్టమవుతుంది. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!