శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) పరిచయం అవసరం లేని పేరు. ఇండియాలోనే ఆమె టాప్ సింగర్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ ఇలా అన్ని భాషల్లోనూ కలుపుకుని ఇప్పటివరకు ఆమె 25000 కి పైగా పాటలు పాడింది. అల్లు అర్జున్ (Allu Arjun)- సుకుమార్ (Sukumar)..ల ‘పుష్ప 2’ (Pushpa 2) లో ‘సూసేకి’, రాంచరణ్ (Ram Charan) – శంకర్ (Shankar)..ల ‘గేమ్ ఛేంజర్’ (Game changer) లో ‘నానా హైరానా’, నాగచైతన్య (Naga Chaitanya)- సాయి పల్లవి (Sai Pallavi)…ల ‘తండేల్’ (Thandel) సినిమాలోని ‘హైలెస్సో’ వంటి చార్ట్ బస్టర్స్ సాంగ్స్ పాడింది.
అయితే ఇటీవల ఆమె తన పాత పాటల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. శ్రేయ ఘోషల్ ఇటీవల ఓ సందర్భంలో… “నేను ఇప్పటివరకు పాడిన పాటల్లో ‘చికినీ చమేలి’ వంటి పాటలు కాస్త సభ్యత హద్దు దాటి పోయినట్టు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిల అందం గురించి వర్ణించడం వేరు, వాళ్ళని సె*క్స్ టాయ్స్ గా అభివర్ణించడం వేరు. వాటి మధ్య ఓ గీత ఉండాలి.
కానీ ‘చికినీ చమేలి’ వంటి కొన్ని పాటల్లో ఆ గీత చిరిగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇటీవల 5, 6 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆడపిల్లలు నా వద్దకి వచ్చి చికినీ చమేలీ పాట అంటే మాకిష్టం అని పాడి, డాన్స్ చేసి వినిపిస్తుంటే నాకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. సింగర్ గా అన్ని పాటలు పాడాలి. అది నా పని.అది తప్పదు కూడా.! కానీ, చిన్న పిల్లలు నేను పాడిన సె*క్సీ పాటలను అనుకరిస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.