ఈ సెలబ్రిటీలకు ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కిందా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్ గా జరిగింది. అందరూ భావించిన విధంగానే రేవంత్ విన్నర్ గా నిలవగా శ్రీహాన్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయని నాగ్ చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో నిర్వాహకులు పూర్తిస్థాయిలో ఓట్ల వివరాలను కూడా బయటపెడితే బాగుండేదని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు భారీగానే రెమ్యునరేషన్లు దక్కాయని సమాచారం.

బిగ్ బాస్ షో ద్వారా ఆదిరెడ్డికి 12 లక్షల రూపాయల రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం. కామన్ మ్యాన్ కేటగిరిలో ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకున్నారని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. సీరియళ్ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కీర్తి భట్ 11 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. వారానికి 75,000 రూపాయల చొప్పున కీర్తికి రెమ్యునరేషన్ దక్కిందని బోగట్టా.

ఇతర లేడీ కంటెస్టెంట్లతో పోలిస్తే కీర్తి భట్ కు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ సీజన్6 రన్నరప్ గా నిలిచిన శ్రీహాన్ కు 15 వారాలకు 26 లక్షల రూపాయల రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ షో ద్వారా శ్రీహాన్ కు మొత్తం 71 లక్షల రూపాయల రెమ్యునరేషన్ దక్కినట్టు తెలుస్తోంది. కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్6 కు హోస్ట్ గా మెప్పించారు.

బిగ్ బాస్ సీజన్7 కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ షో కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్7 ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత రావాల్సి ఉంది. బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల విషయంలో ఫేమ్ ఉన్న వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus