కె.విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీయ శరన్. 2001 లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే 2002 లో నాగార్జున హీరోగా వచ్చిన ‘సంతోషం’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో శ్రీయ గ్లామర్, ఎమోషనల్ సీన్స్ లో ఆమె పలికించిన హావ భావాలు బాగా వర్కౌట్ అవ్వడంతో శ్రీయకి వరుస ఆఫర్లు వచ్చాయి. అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
2002 నుండి 2004 వరకు టాలీవుడ్లో శ్రీయ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ ప్లేస్ కి చేరుకున్న శ్రీయ…. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది.
దాదాపు 10 ఏళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది శ్రీయ. 2018 లో లండన్ కి చెందిన అండీ కోశ్చీవ్ ను పెళ్లాడిన తర్వాత శ్రీయ సినిమాలు కొంచెం తగ్గించింది. కొన్నాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీయ…’ఆర్.ఆర్.ఆర్’ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ‘మిరాయ్’ అనే మరో పాన్ ఇండియా సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించింది శ్రీయ.
ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ గట్టిగానే సంపాదిస్తుంది.మరోపక్క పలు అవార్డు వేడుకల్లో స్టేజ్ పెర్ఫార్మన్స్..లు, అలాగే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ రాణిస్తుంది. మొత్తంగా ఈమె ఏడాది సంపాదన రూ.80 కోట్ల వరకు ఉంటుందని అంచనా.