Shriya Saran: ‘గమనం’ ప్రమోషన్స్ లో లేడీ డైరెక్టర్ల పై శ్రీయ షాకింగ్ కామెంట్స్..!

2001 వ సంవత్సరం డిసెంబర్ 30న విడుదలైన ‘ఇష్టం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీయ. ఆమె ఇండస్ట్రీ అడుగుపెట్టి ఈ డిసెంబర్ 30తో 20 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఓ హీరోయిన్ ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. శ్రీయ ఆ విషయంలో గ్రేట్ అనే చెప్పాలి. త్వరలో శ్రీయ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ఒకటి ఈ శుక్రవారం రాబోతున్న ‘గమనం’ కాగా మరొకటి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ రెండు సినిమాల్లో ఆమె చాలా ముఖ్యమైన పాత్రల్ని పోషించింది. ఇక ‘గమనం’ ప్రమోషన్లలో భాగంగా శ్రీయ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

శ్రీయ మాట్లాడుతూ… “20 ఏళ్ల నుండీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. మొదట ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి.మా అమ్మ ఓ మ్యాథ్స్ టీచర్. నాన్న బీహెచ్‌ఈఎల్‌లో పని చేసేవారు. ‘ఇష్టం’ నా మొదటి సినిమా. ఆ రోజులు ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పటి నుండీ నాకు ఎంతో ప్రేమ లభిస్తుంది. ప్రేక్షకుల ఆధారణ, ప్రేమ వల్లే ఇప్పటికీ రాణించగలుగుతున్నాను. సినిమాల పట్ల నా వ్యవహార శైలి మారింది. నా కూతురు, నా కుటుంబ సభ్యులు నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని పరితపిస్తున్నాను.

ఏ పాత్రైనా మనసుకు నచ్చితేనే చేస్తాను. ‘గమనం’ కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి. ఈ సినిమా కచ్చితంగా చేయాలని బలంగా డిసైడ్ అయ్యాను. సుజనా రావు ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించింది”. అంటూ చెప్పుకొచ్చిన శ్రీయ అనంతరం ‘మహిళలు ఒకప్పుడు వెనుకుండేవారు ఇప్పుడు ముందుకు రాగలుగుతున్నారు. మహిళా దర్శకుల వల్ల పీరియడ్స్ వస్తే ఎటువంటి సంకోచం లేకుండా వారికి చెప్పుకోవచ్చు.అదే మేల్ డైరెక్టర్స్ కు చెప్పుకోలేం కదా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీయ. ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus