Shruti Haasan: రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతి!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండగా కరోనా వల్ల సినిమా నిర్మాతలకు గతంతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఆదాయం తగ్గడంతో కొంతమంది ప్రొడ్యూసర్లు హీరోలను, హీరోయిన్లను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఒక నిర్మాత శృతి హాసన్ ను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరగా నిర్మాతతో జరిగిన సంభాషణను శృతి హాసన్ పంచుకున్నారు. కరోనా సమయంలో ఒక నిర్మాత తనను పారితోషికం తగ్గించుకోవాలని కోరాడని ఆ సమయంలో హీరో రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడానికి నో చెప్పడంతో నేను కూడా రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడానికి అంగీకరించలేదని శృతి హాసన్ అన్నారు.

హీరోహీరోయిన్ల పారితోషికాల మధ్య చాలా గ్యాప్ ఉందని ఆ గ్యాప్ కలలో కూడా ఊహించలేనంత గ్యాప్ అని శృతి హాసన్ కామెంట్లు చేశారు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ గురించి మాట్లాడటం ఇబ్బంది అవుతుందని శృతి తెలిపారు. సలార్ సినిమాలోని తన పాత్ర గురించి కూడా శృతి క్లారిటీ ఇచ్చారు. సినిమాలో కథను తన పాత్రే నడిపిస్తుందని తన పాత్రకు కథతో సంబంధం ఉండదని చాలామంది భావించినా అది నిజం కాదని ఆమె కామెంట్లు చేశారు.

యాక్షన్ డ్రామా మూవీగా సలార్ తెరకెక్కుతోందని సినిమా స్టోరీలోనే యాక్షన్ ఉందని శృతి అన్నారు. అయితే తాను మాత్రం యాక్షన్ సీన్లలో నటించలేదని శృతి హాసన్ కామెంట్లు చేశారు. త్వరలో తను నటించిన బెస్ట్ సెల్లర్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని శృతి అన్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టానని శృతి వెల్లడించారు. తెలుగులో శృతిహాసన్ చిరంజీవికి జోడీగా ఒక సినిమాలో, బాలయ్యకు జోడీగా ఒక సినిమాలో నటించనున్నారు.

త్వరలో ఈ రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీలో గమ్మత్తైన రోల్ లో నటిస్తున్నానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుకానున్న సంగతి తెలిసిందే.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus