సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడని కథానాయికలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఉచితంగా వచ్చింది కాబట్టి.. సోషల్ మీడియాలో తమకు అనిపించిన విషయాలను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా చెప్పేస్తుంటారు నెటిజన్లు. దీని వల్ల ఎక్కువగా ఇబ్బందిపడేది సెలబ్రిటీలే. అలాంటివారిలో శ్రుతి హాసన్ ఒకరు. సెలబ్రిటీ డాటర్‌గా కెరీర్‌ను ప్రారంభించాల్సిన శ్రుతి.. తన కాళ్ల మీద తాను నిలబడి కెరీర్‌ను మలచుకుంది. అయితే ఆమెను మరో కోణంలో నెటిజన్లు కవ్విస్తున్నారు.
ఏకంగా వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. తాజాగా దీని గురించి శ్రుతి హాసన్ స్పందించింది. ప్రస్తుత ప్రపంచం ప్రతికూల ప్రదేశంగా మారింది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది శ్రుతి హాసన్. వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాల్లో ద్వేషాన్ని ఎదుర్కొన్నాను. నన్ను కొంతమంది ‘చుడైల్’ అని పిలిచేవారు. చుడైల్ అంటే మంత్రగత్తె అని అర్థం. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే వ్యవహరిస్తుంటాను అని చెప్పింది శ్రుతి.
మామూలుగా శ్రుతి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఇతరుల విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోదు. కానీ ఆమె వ్యక్తిగత విషయాలను పట్టుకుని ఆమెను ట్రోల్ చేస్తుంటారు. మరోవైపు ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిన ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ అనే అంశం గురించి కూడా శ్రుతి హాసన్ స్పందించింది. సినిమాలను బ్యాన్ చేయాలనే సంస్కృతిని బెదిరింపు అనొచ్చు. అలా బాయ్‌కాట్ అంటూ పిలుపునివ్వడం దాడి చేయడం లాంటి చర్యే అని నా అభిప్రాయం.
అయినా బాయ్‌కాట్ లాంటి చర్య సినిమా పరిశ్రమలోనే చూస్తున్నాం. నిజానికి దీని వెనుక చాలా కోణాలున్నాయి అని నా అభిప్రాయం. ఇలా ఏ విధంగా చూసినా.. ఆన్‌లైన్ సంస్కృతి సమాజంలో ద్వేషం నింపేలా మారింది అని చెప్పుకొచ్చింది శ్రుతి. ఇక శ్రుతి హాసన్ సినిమాల కెరీర్ సంగతి చూస్తే.. మూడు స్ట్రాంగ్ మూవీస్‌లో నటిస్తోంది.
చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ‘వీర సింహా రెడ్డి’, ప్రభాస్‌తో ‘సలార్’లో నటిస్తోంది. ఈ మూడు వచ్చే ఏడాది సందడి చేయబోతున్నాయి. తొలి రెండు సంక్రాంతికి వస్తుండగా, మూడోది సెప్టెంబరులో రిలీజ్ చేస్తారు.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!