Shruti Haasan: పవన్ కళ్యాణ్ సీక్రెట్ రివీల్ చేసిన శృతి హాసన్.. ఏం చెప్పారంటే?

పవన్ కళ్యాణ్ శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని హిట్ జోడీలలో ఒకటనే సంగతి తెలిసిందే. పవన్ శృతి కాంబోలో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. తాజాగా శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గబ్బర్ సింగ్ మూవీ నా కెరీర్ నే కాదు.. నా లైఫ్ ను మలుపు తిప్పిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి లెగోస్(బొమ్మలు)తో ఆడుకునే అలవాటు ఉందని శృతి హాసన్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఈ అలవాటు ఎవరూ ఊహించని అలవాటు అని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.

శృతి హాసన్ (Shruti Haasan) అలా చెప్పిన వెంటనే ఆ ఇంటర్వ్యూలో శృతితో కలిసి పాల్గొన్న సాయితేజ్ మాటాడుతూ మా బాల్యంలో పవన్ కళ్యాణ్ కూడా మాతో కలిసి ఆడుకునేవారని వెల్లడించారు. నిజానికి బొమ్మలతో ఆడుకుందామని ఆయనే మమ్మల్ని పిలిచేవారని సాయితేజ్ వెల్లడించడం గమనార్హం. నేను ఎప్పుడైనా లెగోస్ కొనుగోలు చేస్తే పవన్ కళ్యాణ్ మామయ్య కొరకు కూడా ఒక సెట్ తీసుకునే వాడినని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మా అమ్మ సైతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉంటే లెగోస్ కొనుగోలు చేయాలని పవన్ మామయ్యకు డబ్బులు ఇచ్చేదని సాయితేజ్ కామెంట్లు చేశారు. పవన్ సైతం పలు సందర్భాల్లో లెగోస్ చాలా ఆసక్తిగా ఉండేవని అందుకే వాటితో ఆడేవాడినని తెలిపారు. మరో నాలుగు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ లతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమాలకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రవితేజ సినిమాను పూర్తి చేసి హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus