టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. అయితే కెరీర్ ఆరంభంలో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా ‘అనగనగా ఒక ధీరుడు’ ప్లాప్ అవ్వడంతో అందరూ శృతినే టార్గెట్ చేశారు. ఆ తరువాత ‘ఓ మై ఫ్రెండ్’ కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆమెపై ప్రెజర్ పెరిగింది. అయినప్పటికీ.. అవమానాలు తట్టుకొని ‘గబ్బర్ సింగ్’ సినిమాతో భారీ హిట్ అందుకుంది.
ఈ సినిమా తరువాత శృతి కెరీర్ మలుపు తిరిగింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికీ క్రేజీ ఛాన్స్ లు దక్కించుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ఇదిలా ఉండగా.. తనపై గతంలో జరిగిన ట్రోలింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శృతి. టాలీవుడ్ లో తనను ఐరన్ లెగ్ గా చూశారని.. ‘ప్రేమమ్’ సినిమాకు తనపై చేసిన ట్రోలింగ్ మరే హీరోయిన్ మీద జరిగి ఉండకపోవచ్చని చెప్పింది.
ప్రేమమ్ సినిమా ఒరిజినల్ సినిమాకి ఎంత గుర్తింపు వచ్చిందో తెలిసిందే. మలయాళంలో సాయిపల్లవి చేసిన మలర్ పాత్రను తెలుగులో చేయమని దర్శకనిర్మాతలు సంప్రదించినప్పుడు ఆ పాత్ర నచ్చినా.. ఒక్క క్షణం ఆలోచించానని శృతి చెప్పింది. మొదట చేయకూడదని అనుకున్నానని.. కానీ అలోచించి ఎలాంటి పాత్ర యినా సవాల్ గా తీసుకోవాలని మలర్ పాత్రకి ఓకె చెప్పానని తెలిపింది. ఆ పాత్రను సాయిపల్లవిని మరిపించేలా చేయాలనుకోలేదని.. నా స్టైల్ లో నేను చేశానని చెప్పుకొచ్చింది.
అయినప్పటికీ.. తనను విపరీతంగా ట్రోల్ చేశారని.. అదృష్టం కొద్దీ ఆ సినిమా మంచి సక్సెస్ అయిందని తెలిపింది. ఇక ట్రోల్స్ ని పాజిటివ్ గా తీసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయని చెప్పింది. ఒకరితో మనల్ని మనం పోల్చుకోకూడదని.. ఇంకొకరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని శృతి చెప్పుకొచ్చింది.