ఈ సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్.. ఈ రెండు చిత్రాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ దర్శకుడు కాగా ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. అయితే ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది శృతి హాసన్. ఈ రెండు చిత్రాల ప్రమోషన్లలో భాగంగా ఆమె పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు మీ కోసం :
ప్ర) ఎప్పుడైనా అనుకున్నారా ఇలా సంక్రాంతి వంటి పెద్ద పండుగకు మీరు నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని?
శృతి హాసన్ : నిజానికి ఇది నేను ఎప్పుడూ అనుకోలేదు.కానీ నా కెరీర్ లో ఇలా జరగడం ఇది రెండోసారి. 7 ఏళ్ళ క్రితం నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఒక సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు.. అది కూడా బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వంటి లెజెండరీ హీరోలతో చేసిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎక్సైటింగ్ గా కూడా ఉంది. అది నా అదృష్టంగా ఫీలవుతున్నా.
ప్ర) ఈ రెండు సినిమాల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులు ఈ రెండిటినీ పోల్చి చూస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది అని ఏమైనా ఫీలవుతున్నారా?
శృతి హాసన్ : ఆ అవకాశం ఉంది కానీ.. ఆ భయం అయితే లేదు.ఎందుకంటే రెండు సినిమాల్లోనూ రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలు. ‘వీరసింహారెడ్డి’ లో నా పాత్ర ఫన్ ఫుల్ గా ఉంటుంది. ‘వాల్తేరు వీరయ్య’ లో కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. రెండూ ఛాలెంజింగ్ రోల్స్ అనే చెప్పాలి. దేనికదే ప్రత్యేకమైనదని చెప్పాలి.
ప్ర) ‘వాల్తేరు వీరయ్య’ లో చిరంజీవితో ఫైట్ చేశారట నిజమేనా ?
శృతి హాసన్ : అవునండీ. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చాలా మంచి కాన్సెప్ట్ తో ఆ ఫైట్ ను డిజైన్ చేశారు. నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ ఫైట్ గురించి ఇప్పుడే చెప్పేస్తే ప్రేక్షకులకు థ్రిల్ మిస్ అయిపోతుంది. ప్లీజ్ బిగ్ స్క్రీన్ లో చూడండి(నవ్వుతూ)
ప్ర) చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరూ మంచి డాన్సర్లు…వాళ్లతో డాన్స్ చేయడం ఎలా అనిపించింది ?
శృతి హాసన్ : చిరంజీవి గారు, బాలకృష్ణ గారు… ఇద్దరితో డ్యాన్స్ చేయడం నైస్ ఎక్స్పీరియన్స్. వారిద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు. సుందరి పాట చాలా వైడ్ గా రీచ్ అయ్యింది. శ్రీదేవి చిరంజీవి పాట కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
ప్ర) ఈ రెండు సినిమాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి ?
శృతి హాసన్ : రెండూ ప్రత్యేకమైన సినిమాలు. కథలు, పాత్రలు, ట్రీట్మెంట్ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు సినిమాలకు డిఫరెంట్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.
ప్ర) ఈ రెండు సినిమాల దర్శకులు.. హీరోలకు అభిమానులు? వాళ్ళ అభిమాన హీరోల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయా?
శృతి హాసన్ : అభిమాని దర్శకుడు అయితే ఖచ్చితంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఒక హీరోని ఆరాధించడం వలన వారిలోని బలాలు.. అభిమానైన దర్శకుడికి తెలుస్తుంది. దీనికి నాన్న గారి(కమల్ హాసన్) ‘విక్రమ్’ సినిమా నిదర్శనం. లోకేష్ కనకరాజ్ నాన్న గారి వీరాభిమాని. అది విక్రమ్ లో స్పష్టంగా కనిపించింది. బాలకృష్ణ గారితో గోపీచంద్ గారు, చిరంజీవి గారితో బాబీ గారు పని చేస్తున్నపుడు సెట్ లో అదే ఎనర్జీ కనిపించింది. తెరపై కూడా ప్రేక్షకులు ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తారు. ఈ రెండు సినిమాలు చేస్తున్నప్పుడు నాన్న గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సో ఎక్కడా కూడా నన్నైతే ఇబ్బంది పెట్టిన ఫీలింగ్ కలగలేదు.
శృతి హాసన్ : అవును నాకు కూడా చాలా బాధేసింది. కొంచెం అనారోగ్యం వాటిల్లింది. ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు. వైజాగ్ అంటే నాకు ఇష్టం. ఆ ఈవెంట్ ని చాలా మిస్ అయ్యాను.
ప్ర) బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
శృతి హాసన్ : బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో పని చేయడం అనేది గ్రేట్ ఫీలింగ్. బాలకృష్ణ గారు చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. దేవుడ్ని బలంగా నమ్ముతారు. చిరంజీవి గారు చాలా ప్రశాంతంగా, సున్నితంగా ఉంటారు. వారిద్దరి నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను.
ప్ర) ‘మైత్రీ మూవీ మేకర్స్’ లో హ్యాట్రిక్ కొడతారా?
శృతి హాసన్ : ఎస్.. ‘శ్రీమంతుడు’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ‘మైత్రి’ వారి జర్నీ అద్భుతం. చాలా మంచి సినిమాలు తీశారు. వండర్ ఫుల్ నిర్మాతలు. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. చాలా కష్టపడ్డారు. నవీన్ గారు, రవి శంకర్ గారు చాలా పాజిటివ్ గా ఉంటారు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటారు. చూద్దాం..ఈ బ్యానర్లో హ్యాట్రిక్ కొడతానేమో..!(నవ్వుతూ)