Shruti Haasan: నెటిజన్ కు శృతి దిమ్మతిరిగే కౌంటర్.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సలార్ సినిమాలో శృతి హాసన్ ఆద్య అనే రోల్ లో నటిస్తుండగా ఆ పాత్రకు సంబంధించిన షూట్ ఇప్పటికే పూర్తైంది. సోషల్ మీడియాలో శృతి హాసన్ యాక్టివ్ గానే ఉన్నప్పటికీ తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదు.

తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించగా ఒక నెటిజన్ ఆర్ యూ వర్జిన్ అని అడిగాడు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఏ నటికి అయినా చిరాకు వేస్తుంది. శృతి హాసన్ మాత్రం కూల్ గా స్పందిస్తూ “మొదట నువ్వు స్పెల్లింగ్ రాయడం నేర్చుకో.. వర్జిన్ స్పెల్లింగ్ ఇదేనా” అని కౌంటర్ ఇచ్చారు. నెటిజన్ వర్జిన్ స్పెల్లింగ్ ను తప్పుగా పేర్కొనడంతో ఈ కామెంట్లు చేశారు.

ఒక వ్యక్తి నేను మీతో డేటింగ్ చేయాలని అనుకుంటున్నానని చెప్పగా శృతి హాసన్ వెంటనే నో చెప్పారు. సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుంది. మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది.

శృతి హాసన్ ఇతర హీరోయిన్లకు భిన్నంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. శృతి పారితోషికం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. శృతి హాసన్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. శృతి హాసన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus