Shruti Haasan: ప్రభాస్ సలార్ మూవీకి హైలెట్ సన్నివేశాలు ఇవేనా?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. ఈ సినిమా రిలీజ్ కు మరో ఎనిమిది నెలల సమయం ఉండగా సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, శృతి హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం. సలార్ మూవీలో క్లైమాక్స్ ఫైట్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని ఈ సీన్ లో శృతి హాసన్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.

నిర్మాతలు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాకు 600 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. చాలారోజుల ముందే రిలీజ్ డేట్ ను ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాకు పోటీగా మరో సినిమా రిలీజయ్యే అవకాశం కూడా దాదాపుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ మూవీ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి2 సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సలార్ అనే సంగతి తెలిసిందే.

సరికొత్త కథాంశంతో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం. ఈ ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus