Shruti Haasan: డీ గ్లామర్ లుక్‌తో శృతి హాసన్ చేసిన పోస్ట్ వైరల్..!

దోశె అన్నాక మందంగా ఉండాలి.. హీరోయిన్ అంటే అందంగా ఉండాలి అని అంటుంటారు. కథానాయికలు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నా కానీ ఆన్ స్క్రీన్ మాత్రం అందంచందాలతో అదరగొట్టెయ్యాలి.. ఆడియన్స్‌ని అలరించాలి.. స్పెషల్ సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేయాలి.. ఇదే ప్రేక్షకులు కోరుకునేది.. అందుకు తగ్గట్టుగానే ఫిజిక్, స్కిన్ టోన్ లాంటివి మెయింటెన్ చేయడానికి ముద్దుగుమ్మలు ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. సోషల్ మీడియాలోనూ గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేసే హీరోయిన్స్..

వితౌట్ మేకప్ ఫోటోస్ షేర్ చేయడానికి ఇష్ట పడరు. అలా చేయాలంటే మాత్రం కచ్చితంగా ధైర్యం కావాలి.. ఎందుకంటే విపరీతంగా వచ్చే ట్రోలింగ్స్‌ని ఫేస్ చెయ్యలి కదా.. ఇప్పుడలాంటి డేరింగ్ అటెంప్ట్ చేసింది యాక్ట్రెస్ కమ్ మ్యుజీషియన్ శృతి హాసన్.. తను షేర్ చేసిన పిక్ చూసి ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘బాబోయ్.. శృతికి ఏమైంది?.. హీరోయిన్ ఫేస్ అంటే ఇలాగేనా ఉండేది.. ఉండాల్సింది?.. సమంతలానే శృతికి కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లమా?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అసలేం జరిగిందనేది తన పోస్టులో వివరించిందీ హీరోయిన్.. డీ గ్లామర్ పిక్ పోస్ట్ చేయడం ద్వారా ట్రోలింగ్స్ వస్తాయని, అది తమ కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని భయపడే మిగతా హీరోయిన్లలా కాదు నేను.. డోంట్ కేర్ అంటూ షాకింగ్ ఫోటో వదిలింది. ప్రస్తుతం శృతి హాసన్ ఫీవర్, సైనస్‌తో బాధపడుతుందట.. ‘‘బ్యాడ్ డే.. బ్యాడ్ హెయిర్‌తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది.. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు.. ఇష్టపడతారని అనుకుంటున్నాను’’ అని కామెంట్ చేసింది.

దీంతో త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్, సెలబ్రిటీలు మరియు నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. శృతి హాసన్, మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ బాలకృష్ణతో ‘వీర సింహా రెడ్డి’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాలు చేస్తోంది. చిరు, బాలయ్య లాంటి సీనియర్లతో చేసిన చిత్రాలు 2023 సంక్రాంతికి విడుదల కానున్నాయి.. హెల్త్ సెట్ అయిన తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుంది శృతి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus