Shruti Hassan: ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్!

ఈ సంక్రాంతి కానుకగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలు రెండు కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలపై అభిమానులు ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అలాగే ఈ రెండు సినిమాలలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ నటించారు. ఇలా శృతిహాసన్ ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా నటించడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వాల్తేరు వీరయ్య సినిమాలోని ఒక పాట చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా అనే పాట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ పాట చిత్రీకరణను స్విట్జర్లాండ్‌, ఇటలీ బార్డర్‌లో ఉన్న ఆర్బ్స్ మౌంటేన్‌ లోయలో మంచు ప‌డుతున్న సమయంలో మైనస్ డిగ్రీల చలిలో ఈ పాటను చిత్రీకరించారు.

అయితే ఈ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డాను అని శృతిహాసన్ తెలిపారు.ఇక ఈ పాట చిత్రీకరణ సమయంలో తాను చీర కట్టుకోవడం వల్ల ఫిజికల్ గా చాలా ఇబ్బంది పడ్డానని ఇంకోసారి ఇలాంటి పరిస్థితులలో నటించకూడదనే భావన తనలో కలిగిందని తెలిపారు. ఇలా మైనస్ డిగ్రీల చలిలో కూడా తాము ఎంతో బాధ అనుభవిస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఆనందం కోసమే ఇంతగా కష్టపడి నటిస్తున్నామని ఈ సందర్భంగా శృతిహాసన్ తెలియజేశారు.

ఇక ఈ పాట చిత్రీకరణ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా రిస్క్ తీసుకున్నారనే చెప్పాలి.ఇలాంటి రీస్కులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా రిస్కు తీసుకొని నటించినప్పుడే ఇండస్ట్రీలో ఉండడానికి అర్హులని అలా లేని సమయంలో వాళ్లు రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఉండటం మంచిది అంటూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిరు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus