Shruti Hassan: హీరోయిన్లకు కనీసం కోట్ కూడా ఇవ్వరు!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి శృతిహాసన్ ఒకరు. ఏడాది మొదట్లోనే ఈమె వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా ఈ సినిమాలతో మంచి హిట్ అందుకున్న శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ వాల్తేరు వీరయ్యలో మంచు కొండల్లో చేసిన డ్యాన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మంచులో డాన్స్ చేయడం అంటే చాలా కష్టం.ఇలాంటి పాటలలో నటించే సమయంలో హీరోలు మాత్రం ఈ మంచును తట్టుకునే విధంగా జాకెట్స్ వేసుకుంటారు.

కానీ హీరోయిన్లకు మాత్రం అలాంటివి ఏమీ ఇవ్వరు కనీసం జాకెట్టు శాలువా కూడా ఇవ్వరని కేవలం చీర జాకెట్ లోనే అంత గడ్డకట్టే చలిలో మంచు కురుస్తున్న కూడా డాన్స్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇలా ఇబ్బందికరంగా డాన్స్ చేయడం చాలా కష్టమని, దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలి అంటూ ఈమె కోరుకున్నారు.

ఇటీవల ఒక సినిమాలో తనకు (Shruti Hassan) కూడా ఈ విధమైనటువంటి అనుభవం ఎదురైందని ఈ సందర్భంగా శృతిహాసన్ తెలియజేశారు.ఇలా మంచు కొండల్లో పాటలకు డాన్స్ చేయడం గురించి ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus